ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao) అరెస్ట్ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా (Roja) తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ, మీడియా స్వేచ్ఛను అణిచివేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. పత్రికా రంగంలో కొమ్మినేని శ్రీనివాసరావు సుదీర్ఘకాలంగా తనదైన ముద్ర వేసిన వ్యక్తి అని, నిజాయితీగా ప్రశ్నించే గొంతుకని రోజా ప్రశంసించారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే హక్కు మీడియాకు ఉందని, ఇలాంటి అరెస్టులు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని మండిపడ్డారు.
Nandamuri Balakrishna : నాకు చాలా పొగరు అనుకుంటారు.. ఎస్ నన్ను చూసుకుని నాకు పొగరు…
ఈ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని రోజా ఆరోపించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని అసలైన సమస్యల నుంచి మళ్లించేందుకు కుట్ర పన్నిందని ఆమె విమర్శించారు. అనంతపురంలో గిరిజన విద్యార్థిని తన్మయ్‌పై జరిగిన హత్యాచారంపై ప్రభుత్వ మౌనం కొనసాగుతున్న విషయాన్ని ఉదహరిస్తూ.. హోంమంత్రి అనిత ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమని అన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రోజా విమర్శించారు.
Viral : అమెరికాలో భారత విద్యార్థిపై పోలీసుల అమానుష ప్రవర్తన… వైరల్ అవుతున్న వీడియో
ప్రజల సమస్యలపై స్పందించకుండా విభిన్న అంశాలపై దృష్టి మళ్లించే ప్రయత్నం చేయడం కూటమి ప్రభుత్వానికి తగదు అని రోజా హెచ్చరించారు. ప్రభుత్వం చేపట్టిన అక్రమ చర్యలు రేపు తామే అధికారంలోకి వచ్చాక ప్రజలకు చూపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. “ఇప్పుడు మీరు చేస్తే, రేపు మేము చూస్తాం” అన్న రోజా, ప్రజలు త్వరలోనే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించిన ఆమె, ప్రభుత్వ తీరును మార్చుకోవాలని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.