టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) కావడం..కనీసం బెయిల్ కూడా రాకపోవడం..మరోపక్క పలు కేసులు పెడుతుండడం టీడీపీ (TDP) శ్రేణులను తిండి కూడా తినకుండా చేస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎంతో మంది మనోవేదనకు గురై ఆత్మహత్య లు చేసుకోవడం..గుండెపోటు తో మరణించడం జరుగుతున్నాయి. మరోపక్క ఏపీలోనే కాకుండా యావత్ ప్రపంచం లో ఉన్న తెలుగు వారంతా చంద్రబాబు కు సంఘీభావం తెలుపుతూ..అయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ శ్రేణుల ఆవేదన ఇలా ఉంటె..వైసీపీ నేతలు (YCP Leaders) మాత్రం చంద్రబాబు అరెస్ట్ దగ్గరి నుండి జరుగుతున్న సంఘటనలు చూస్తూ మరింత సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మంత్రి రోజా (RK Roja) ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ కాగానే బాణా సంచా కాల్చి తన ఆనందాన్ని వ్యక్తం చేసిన రోజా..ఆ తర్వాత కూడా అదే కొనసాగిస్తూ వస్తుంది. తాజాగా తన ట్విట్టర్ (X) లో లోకేష్ .. నీ లొకేషన్ ఎక్కడా..? అంటూ సెటైరికల్ ట్వీట్ చేసింది.
Read Also : Madhapur Drugs Case : డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ నార్కోటిక్ విచారణ పూర్తి
దేశంలోనే అవినీతి అనకొండ అయిన నారా చంద్రబాబు నాయుడికి తొలి కస్టడీ డే శుభాకాంక్షలు. ఖైదీ నెంబర్ 7691 కడుపున పుట్టిన నారా లోకేష్ .. నీ లొకేషన్ ఎక్కడా..? తండ్రి అడ్డంగా తినేసి జైలుకి వెళితే మా నాన్న ఎలా పోయిన పర్లేదు నేను మాత్రం అరెస్ట్ కాకూడదని పారిపోయిన లోకేష్ ఆంధ్రా కి ఎప్పుడొస్తావ్..? తల్లి, భార్య మీద మీ నాన్న భారం వదిలి పలాయనం చిత్తగించిన పులకేశ్ నీ జాడ ఎక్కడ..? మీ నాన్న అవినీతి పై బహిరంగ చర్చకు రమ్మన్నావ్.. నువ్వేమో ఆంధ్ర వదిలి పారిపోయావ్.. మీ మావ బాలయ్య అసెంబ్లీ వదిలి పారిపోయాడు. చంద్రబాబు గజదొంగ అని అసెంబ్లీ సాక్షిగా నిరూపించడానికి మేం సిద్ధం.. కాదని నిరూపించే ధైర్యం ఉందా ..? లోకేష్.. ధైర్యం ఉంటే.. అసెంబ్లీ కి మిలో ఎవరు వస్తారో.. రండి.. ఇది మా వైసీపీ సవాల్..అంటూ మంత్రి రోజా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఫై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
https://x.com/RojaSelvamaniRK/status/1705544895820439625?