Site icon HashtagU Telugu

Roja Blue Film Issue : మిర్యాల‌గూడ‌లో రోజా ఎవ‌రితో గ‌డిపారు? `బ్లూ ఫిల్మ్ ` నిజ‌మేనా?

Roja Bule Film Issue

Roja Bule Film Issue

Roja Blue Film Issue :  ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు మంత్రి రోజా `బ్లూ ఫిల్మ్` వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, ఆమె 1999లో మిర్యాలగూడ‌లో ఎవ‌రితో గ‌డిపిందో తెలుసంటూ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్య ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల్లో మారుమ్రోగుతోంది. ఆ స‌మయంలో రోజా టీడీపీలో లేద‌ని చెబుతూ మిర్యాల‌గూడ‌కు చెందిన ఒక‌రితో రోజా గ‌డప‌డాన్ని బ‌య‌ట‌పెట్టారు. పైగా అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయ‌ని చెప్ప‌డం బండారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో న్యూస్ మేక‌ర్ గా మారారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి రోజా ఏపీ మ‌హిళా క‌మిష‌న్ కు లేఖ రాయ‌గా, పోలీసులు బండారు ఇంటిని చుట్టుముట్టారు. స‌త్యాగ్ర‌హ దీక్ష వేళ ఇదో ఎపిసోడ్ ను వ్యూహాత్మ‌కంగా వైసీపీ తెర‌మీద‌కు తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.

మిర్యాలగూడలో రోజా ఎవరితో గడిపారు (Roja Blue Film Issue) 

జైలుకు చంద్ర‌బాబును పంపిన రోజు మంత్రి రోజా స్వీట్లు పంచుకుని సెల‌బ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు, ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. శాప‌నార్థాలు పెడుతూ చంద్ర‌బాబు మీద పోస్టు లు కూడా పెట్టారు. వాటిని చూసిన టీడీపీ క్యాడ‌ర్ రోజా మీద ఫైర్ అవుతూ ప్ర‌తిగా రియాక్ట్ అయ్యారు. వాళ్ల ఆగ్ర‌హానికి మ‌రింత ఆజ్యం పోస్తూ బ్ర‌హ్మ‌ణి, భువ‌నేశ్వ‌రిల ప్రైవేటు జీవితంలోకి రోజా తొంగిచూశారు. ఆ మేర‌కు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ రోజా నోరు పారేసుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల‌కు మండింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా రోజా (Roja Blue Film Issue) బూతు వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట పెట్టారు. ఒక‌డుగు ముందుకేసి మాజీ మంత్రి బండారు స‌త్య‌నారాయ‌ణ మీడియా స‌మావేశం నిర్వ‌హించి రోజా బ్లూ ఫిల్మ్ వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెట్టారు.

రోజా బ్లూ ఫిల్మ్ ల్లో సైతం నటించిందని బండారు

గతంలో రోజా బ్లూ ఫిల్మ్ ల్లో సైతం నటించిందని బండారు చెప్పుకొచ్చారు. 1999 ఎన్నికల్లో మిర్యాలగూడలో ఎన్నికల ప్రచార సమయంలో రోజా ఎవరితో గడిపారు తనకు తెలుసునని సంచలన కామెంట్స్ చేశారు. ఆ సమయంలో రోజా తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదని.. తాను టిడిపి ప్లానింగ్ కమిటీ సభ్యుడిగా ఉండేవాడినని సత్యనారాయణమూర్తి గుర్తు చేశారు. రోజా ది చీకటి బతుకు అని ఆరోపించారు. ఆమె బ్లూ ఫిలిమ్స్ వీడియోలు తమ వద్ద ఉన్నాయని, మహిళలను కించపరచడం తమ ఉద్దేశం కాదని, అందుకే విడిచిపెట్టినట్లు బండారు సత్యనారాయణమూర్తి వెల్లడించారు. మరోసారి చంద్ర‌బాబు, నంద‌మూరి కుటుంబ స‌భ్యుల గురించి నోరుపారేసుకుంటే రోజా చీకటి బాగోతాన్ని  (Roja Blue Film Issue) బయటపెడతానని హెచ్చరించారు.

Also Read : AP BRS: ఏపీ పాలన గాలికొదిలేసిన వైకాపా ప్రభుత్వం: ఏపీ బీఆర్ఎస్ చీఫ్

మాజీ మంత్రి బండారు బ‌య‌ట‌పెట్టిన `బ్లూ ఫిల్మ్` వ్యాఖ్యాల‌పై మంత్రి రోజా ఏపీ డీజీపీకి, మహిళా కమిషన్ కు నాలుగు రోజుల క్రితం లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. అయితే, వ్యూహాత్మ‌కంగా స‌త్య‌గ్ర‌హ‌దీక్ష వేళ బండారు ఎపిసోడ్ ను ఏపీ పోలీస్ బ‌య‌ట‌కు తోడారు. ఉద‌యం నుంచి ఆయ‌న ఇంటి వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డానికి నానా హంగామా సృష్టించారు. మీడియా ఫోక‌స్ అంతా అటు వైపు మ‌ళ్లింది. ప్ర‌జ‌ల మూడ్ ను స‌త్యాగ్ర‌హ దీక్ష నుంచి రోజా బ్లూఫిల్మ్ ఎపిసోడ్ వైపు చాక‌చక్యంగా వైసీపీ తిప్ప‌డం కొస‌మెరుపు.

Also Read : Delhi to AP : స‌త్య‌మేవ జ‌య‌తే..! లూథ్రా ట్వీట్  ట్విస్ట్!