Site icon HashtagU Telugu

NTR District : ఎన్టీఆర్ జిల్లాలో దోపిడీ దొంగ‌లు హ‌ల్చ‌ల్‌.. మ‌న‌వ‌డి పేరు చెప్పి..!

Robbery Imresizer

Robbery Imresizer

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని తుమ్మలపాలెం గ్రామంలో అర్ధరాత్రి దోపిడీ దొంగ‌లు హ‌ల్చ‌ల్ చేశారు. ఒక వృద్ధురాలు నివాసముంటున్న ఉంటున్న ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు పక్కా పథకం ప్రకారం చోరికి పాల్పడ్డారు.ఈ చోరీ స్థానికుల‌ను ఆందోళ‌న‌కు గురి చేసింది. తుమ్మలపాలెం గ్రామానికి చెందిన చెల్లు రామాయమ్మ (85) వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. నిన్న అర్ధరాత్రి సమయం లో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి తలుపు కొట్టారు. అర్ధరాత్రి సమయం లో తలుపు కొడుతున్నారని దొంగలు గా భావించిన వృద్ధురాలు భయం తో తలుపు తీయలేదు. దీంతో చాలా సేపు తలుపు కొట్టిన దుండగులు నేను నీ మనవడు చాణక్య ను తలుపు తీయి బామ్మ అంటూ నమ్మబలికారు.

మనవడు పేరు చెప్పడం తో తలుపు తీసిన వృద్ధురాలిని ప్లాస్టిక్ కవర్ లతో చేతులు బందించి మొహం పై దిండు తో నొక్కి మెడలోని గొలుసు తీసుకువెళ్లినట్లు బాధితురాలు తెలిపారు. డబ్బులు ఇస్తాను అని బతిమిలాడినా వినలేదని మెడ లో లక్ష రూపాయల విలువ చేసే చైన్ లాక్కొని పరారైనట్లు వృద్ధురాలు పోలీసులకు తెలిపారు. వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. వృద్ధురాలు మనవడి పేరు చెప్పి దొంగతనానికి పాల్పడటం తో వృద్ధురాలిని పరిశీలించి దొంగతనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అదే గ్రామం లో ఒక ఇంటి నిర్మాణం పనులకు వచ్చే వారిలో ఒకరికి వేరే ప్రాంతం లో ఉన్న తన మనవడి గురించి వృద్ధురాలు చెప్పినట్లు పోలీసులకు చెప్పడం తో ఆ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు.