Site icon HashtagU Telugu

AP Rains : అమ‌రావ‌తితో తెగిన బంధం

Ap Rains

Ap Rains

కొత్త‌గా ఏర్ప‌డిన పల్నాడు జిల్లా అమరావతి మండలం పెదమద్దూరు గ్రామం వద్ద వంతెనపై వరద నీరు పొంగిపొర్లుతోంది. ఫ‌లితంగా అమరావతి-విజయవాడ మధ్య రోడ్డు కనెక్టివిటీ తెగిపోయింది. ముందుజాగ్రత్త చర్యగా రోడ్డుకు ఇరువైపులా మూసివేశారు. విజయవాడ నగరం నుంచి అమరావతికి వెళ్లే వాహనాలను చవపాడు గ్రామం మీదుగా మళ్లించారు. లంక‌ గ్రామాల వద్ద వందలాది గేదెలు వరద నీటిలో చిక్కుకున్నాయి. చిక్కుకున్న పశువులను చూసి యజమానులు ఆందోళన చెందుతున్నారు. వరదల కారణంగా ఎలాంటి మానవ, ఆస్తి నష్టం జరగలేదు. పులిచింతల ప్రాజెక్టు నుంచి వరదనీరు విడుదలవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.