Site icon HashtagU Telugu

Road Accident: హైవేపై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

Road Accident

Resizeimagesize (1280 X 720) (1) 11zon

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పం-పలమనేరు హైవేపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కారును లారీ ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పీఈఎస్ ఆస్పత్రి వైద్యులు వికాస్, కల్యాణ్, ప్రవీణ్‌గా పోలీసులు గుర్తించారు.

Also Read: Fire Breaks Out: మహారాష్ట్రలోని షుగర్ మిల్లులో బాయిలర్ పేలుడు.. ఇద్దరికి గాయాలు

కుప్పం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుప్పం పలమనేరు జాతీయ రహదారి శెట్టిపల్లి సమీపంలో లారీని కారు ఢీ కొట్టిన ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. కారు‌ నుజ్జు నుజ్జు అయ్యింది. మృతులు పి.ఈ.ఎస్ ఆసుపత్రిలో ఇద్దరు ఎంబిబిఎస్ చదువుతున్నారు, ఒకరు ఎంబిబిఎస్ విద్యార్థి తమ్ముడిగా గుర్తించారు. వికాస్, కళ్యాణ్, ప్రవీణ్ గా గుర్తించారు. రూరల్ సిఐ రియాజ్ అహ్మద్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.