Site icon HashtagU Telugu

AP: శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…ముగ్గురు మృతి..!!బాధితులంతా తెలంగాణవాసులే..!!

Mexico Bus Crash

Road accident

ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. మరోకరు చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించినవారిలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. వీరిద్దరు భార్యభర్తలుకాగా మరొకరు వీరి బంధువు. బాధితులు తెలంగాణలో వరంగల్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు.

పూర్తవివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన రమ్య, గోపినాథ్ వీరిద్దరు భార్యభర్తలు. వీరు తమ పిల్లలను తీసుకుని బెంగుళూరుకు కారులో వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తుండగా మరో బంధువు తారకేశ్వరి కూడా వారితో ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రీసత్యసాయి జిల్లా పర్వతదేవరపల్లి వద్ద కారు అదుపుతప్పింది. బలంగా డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్యభర్తలు అక్కడిక్కడే మరణించారు. మిగిలినవారికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తారకేశ్వరి మరణించింది. వారి ఇద్దరి పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.