Nara Lokesh : నారా లోకేష్ టంగ్ స్లిప్ అవ్వడంతో.. థాంక్స్ చెప్పిన మంత్రి రోజా

ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబుకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామనే ఉద్దేశ్యంతో మాట్లాడబోయి, చంద్రబాబు చేసిన అన్యాయాన్ని అంటూ లోకేష్ పొరపాటున మాట్లాడారు.

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh Tongue Slip

Nara Lokesh Tongue Slip

రాజకీయ నాయకులు సభల్లో , సమావేశాల్లో , లైవ్ లో మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతుంటారు. ఇది చాల కామన్..అయితే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) కూడా అలాగే టంగ్ స్లిప్ అవ్వడం తో వైసీపీ మంత్రి రోజా (RK Roja) థాంక్స్ చెప్పారు.

రాజమండ్రి జైల్లో రిమాండ్ లో ఉన్న తన తండ్రి చంద్రబాబు (Chandrbabu)ను ఈరోజు లోకేష్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ..ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబుకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామనే ఉద్దేశ్యంతో మాట్లాడబోయి, చంద్రబాబు చేసిన అన్యాయాన్ని అంటూ లోకేష్ పొరపాటున మాట్లాడారు (Nara Lokesh Tongue Slip). దీనికి వైసీపీ మంత్రి రోజా ట్విట్టర్ లో స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

‘చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయానికి ఈరోజు అరెస్టు అయ్యారు, చంద్రబాబు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల డబ్బులను దోచుకున్నారో ఆయన చేసిన అన్యాయాన్ని గడపగడపకి వైసీపీ వెళ్ళి తెలియజేస్తుంటే, మేము కూడా గడపగడపకు వెళ్లి ప్రతిమనిషికి కూడా చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాన్ని చెబుతామని చెప్పినందుకు థాంక్యూ.. లోకేశ్. ఇప్పటికైనా మీ తండ్రి చేసిన తప్పుల్ని, ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పడమే కాదు ప్రజల్ని క్షమించమని అడిగితే ఇంకా బాగుంటుంది..!!’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ను వైసీపీ శ్రేణులు తెగ వైరల్ చేస్తున్నారు.

Read Also : AP TDP : స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ పై పుస్తకాన్ని ఆవిష్క‌రించిన టీడీపీ నేత‌లు

  Last Updated: 06 Oct 2023, 07:57 PM IST