Site icon HashtagU Telugu

Rishiteswari Case : రిషితేశ్వరి కేసు కొట్టివేత..మాకు న్యాయం జరగలేదని తల్లిదండ్రుల ఆవేదన

Rishiteswari Case Dismissed

Rishiteswari Case Dismissed

2015లో గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ(Nagarjuna University)లో రిషితేశ్వరి ఆత్మహత్య కేసు (Rishiteswari Case) తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య(Rishiteshwari Suicide)కు ర్యాగింగ్, మానసిక వేధింపులే కారణమని ఆరోపణలతో ఆమె తల్లిదండ్రులు కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తూ వచ్చారు. అయితే తాజాగా గుంటూరు కోర్టు(Guntur Court) ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు (Rishiteswari Case Dismissed) ఇచ్చింది. ఈ తీర్పు బాధిత కుటుంబానికి తీవ్ర మానసిక ఆవేదనకు గురిచేసింది.

రిషితేశ్వరిని ఫ్రెషర్స్ పార్టీలో సీనియర్లు లైంగికంగా వేధించారని, ఆ విషయం ప్రిన్సిపల్కు చెప్పినా పట్టించుకోలేదని ఆమె పేరెంట్స్ చెప్పుకొచ్చారు. నిందితుల పేర్లు డైరీలో ఉన్నాయని, ఆ డైరీని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో తెలియడం లేదన్నారు. 9ఏళ్లుగా న్యాయం కోసం చూశామని, ఇక ఓపిక లేదని ఆమె తల్లి కోర్టు ఆవరణలోనే (Rishiteswari Mother Emotional) విలపించారు. 2015 జులై 14న నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. ర్యాగింగ్ కారణంగా తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు యువతి సూసైడ్ నోట్ రాసింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు ఆమె లేఖలో పేర్కొంది. కాగా, అప్పట్లో రిషితేశ్వరి ఆత్మహత్య సంచలనంగా మారింది. బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇప్పుడు ఈ కేసును కోర్ట్ కొట్టివేసింది. రిషితేశ్వరి తల్లి దుర్గాబాయి మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నామని, న్యాయం జరుగుతుందని భావించామన్నారు. తమకు న్యాయం జరగలేదంటూ ఇంకెవరికీ న్యాయం జరగదని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పీల్‌కు వెళ్లాలా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పుకొచ్చింది.

రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ మాట్లాడుతూ.. రిషితేశ్వరి డైరీలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కావటం లేదన్నారు. డైరీలో అన్ని విషయాలు వివరంగా ఉన్నాయన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిషితేశ్వరే డైరి రాసినట్లు నివేదిక ఇచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు , ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద్ద‌కు న్యాయం కోసం ఆశ్ర‌యిస్తామ‌ని పేర్కొన్నాడు.

Read Also : Rohit Second Test: రెండో టెస్టులో రోహిత్ ఎంట్రీ.. రాహుల్ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో మార్పులు