Site icon HashtagU Telugu

Rise Survey on AP : ఏపీలో కూటమిదే విజయం

Ap Elections

Ap Elections

ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (AP) ఎన్నికల మూడ్‌లో ఉంది. అధికార -ప్రతిపక్ష పార్టీలు పోటీపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ తరుణంలో పలు సర్వేలు ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తూ..ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి మద్దతు తెలుపుతున్నారో..ఎవరికీ పట్టం కట్టబోతున్నారో వంటివి తెలుపుతున్నారు. ఇప్పటికే అనేక సర్వేలు తమ అభిప్రాయాన్ని తెలియజేయగా..తాజాగా రైజ్ సర్వే (Rise Survey) ప్రజలు కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు స్థానాల్లో గెలువనున్నాయని , అధికార వైసీపీ పార్టీ 41 నుంచి 54 స్థానాల లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది. ఇక 43 స్థానాల్లో మాత్రం హోరాహోరీ పోరు జరుగనుందని తెలిపింది. ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుందని సర్వే సంస్థ పేర్కొంది. కూటమి పార్టీలకు 51% రానుండగా వైసీపీ 44 శాతానికి పరిమితం కానుందని తాజా సర్వేలో తేలింది. కేవలం రాయలసీమ లో మాత్రమే వైసీపీ గాలి వీస్తోందని..మిగతా అన్ని చోట్ల కూటమి జోరు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపింది. లోక్ సభ స్థానాల్లో కూటమికి 18 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయని సంస్థ వెల్లడించింది. మరి ఈ సంస్థ తెలిపినట్లు జరుగుతుందా..లేదా అనేది తెలియాలంటే జూన్ 04 వరకు ఆగాల్సిందే.

Read Also : Glass Symbol : స్వతంత్రులకు గ్లాస్‌ గుర్తు.. మార్పు తప్పదు..!