Site icon HashtagU Telugu

AP : మళ్లీ పల్నాడులో అల్లర్లు..రంగంలోకి కేంద్ర బలగాలు..!

Riots again in Palnadu.. Central forces enter the field..!

Riots again in Palnadu.. Central forces enter the field..!

Riots in Palnadu: ఏపిలో సోమవారం లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అయితే సాయంత్రం దాకా అంతా బాగానే జరగ్గా.. ఐదు గంటల తర్వాత పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. టీడీపీ(TDP), వైసీపీ(YCP) శ్రేణులు రెండు గ్రూపులుగా విడిపోయి..బాంబులు, పెట్రోలు బాంబులతో దాడులు చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఈ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొగా.. పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొద్ది సేపటికి పరిస్థితి సాధారణంగా మారినప్పటికీ.. మళ్లీ అల్లర్లు చెలరేగాయి. దీంతో మొదట వైసీపీ నేతలే తమపై దాడి చేశారని కొత్తగనేషునిపాడులోని వైసీపీ నేతల ఇళ్లను టీడీపీ నేతలు కూలగొట్టినట్లు తెలుస్తుంది. దీంతో రాత్రి మొత్తం వారు స్థానిక గుడిలో పోలీసులు బందోబస్తు నడుము తలదాచుకున్నారు. కాగా మంగళవారం మరోసారి టీడీపీ నేతలు భారీ ఎత్తున ఆ గ్రామాన్ని చుట్టుముట్టి నట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు కాసు బ్రహ్మానందరెడ్డి, అనిల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోసారి పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది. వారి కాన్వాయ్ పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు.. అదుపుతప్పిన పరిస్థితిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. అలాగే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలతో పాటు, స్థానికులను ఆ కాన్వాయ్ ను కేంద్ర బలగాలతో తరలించినట్లు తెలుస్తోంది. కాగా పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పల్నాడులో ఆంక్షలు కొనసాగించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఏ క్షణం ఏం జరుగుద్దోనని కొత్త గణేషునిపాడులో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

Read Also:TG Lok Sabha Polling : పార్లమెంట్ ఎన్నికల్లో 12 , 14 సీట్లు సాదించబోతున్నాం – భట్టి