Site icon HashtagU Telugu

Inside Story : హీరోలను ఫ్లైట్ ఎక్కించిన బూచి

Tollywood Detective

Tollywood Detective

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సరైన సమయంలో కరెక్ట్ గా ట్వీట్ చేస్తాడు. అందుకే ఆయన ఏది చేసినా న్యూస్ అవుతుంది. తాజాగా చిరు అండ్ టీం వెళ్లి జగన్ ను కలిసిన అంశంపై సెటైర్ వేశాడు. సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ హల్చల్ చేస్తోంది. సూపర్, మెగా , బాహుబలి స్థాయి అడుక్కోవటం అంటూ చేసిన ట్వీట్ టాలీవుడ్ ను టచ్ చేసింది. ప్రత్యేకించి చిరంజీవి అడుక్కోవటం వీడియో లో చూస్తే అభిమానులు ఆయన వెటరన్ హీరో వేషాలు గుర్తు వస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. వయసు మీద పడటం , రాజకీయ సుఖాన్ని అనుభవించిన చిరు అధికారానికి బెండు కావటం పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. వేదికలపై సవాళ్లు విసిరే పవన్ ఆ వీడియో చూసి చలో రే చల్ అంటూ మదన పడుతున్నాడట.సినీ హీరోలు చిరంజీవి, రాజమౌళి, మహేశ్ బాబు డైరెక్టర్ లు కొరటాల శివ, ప్రభాస్, నారాయణ మూర్తి, అలీ, పోసాని కృష్ణ మురళి ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన సందర్భంగా హీరోల స్థాయిపై వ్యంగంగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేసాడు. ఆ సమావేశంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టాలీవుడ్ స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.సూపర్, మెగా, బాహుబలి స్థాయిలో అడుక్కోవడం వల్లే ఈ సమావేశం జరిగిందని తేల్చాడు. సీఎం జగన్ వారికి వరాలు ఇచ్చారని మెగాస్టార్ అన్నారు. సూపర్, మెగా, బాహుబలినిమించిన మహాబలి వైఎస్ జగన్ చొరవను అభినందిస్తున్నానని వర్మ సెటైర్ వేశారు.

ఏపీ ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితులకు తెరదించేందుకు చిరు అండ్ టీమ్ ప్రయత్నం చేసింది., భవిష్యత్ లో అంతా సాఫీగా సాగేందుకు కృషి చేసిన మెగాస్టార్ అక్కడకు వెళ్లి జగన్ ను పొగిడారు. సరిగ్గా ఇక్కడే వర్మకు మండింది. వాస్తవంగా మంత్రి పేర్ని నాని తో వర్మ భేటీ అయ్యాడు. ఆనాడు మంత్రి ఆహ్వాన మేరకు వెళ్ళాడు.ఆ తరువాత చిరంజీవి ఏకాంతంగా జగన్ తో భేటీ అయ్యాడు. ఇప్పుడు చిరు తో పాటు బాహుబలి ప్రభాస్ , మహేష్ కనిపించటం చర్చనీయాంశంగా మారింది.బేగం పేట విమానాశ్రయం వద్ద ఫ్లైట్ ఎక్కే వరకు చిరుతో ఎవరు నడిస్తారో తెలియదు. ఆయన కూడా చెప్పలేని పరిస్థితి లో ఉన్నాడు. అంటే, చిరు వెనుక కథని ఏరో అపరిచితుడు నడిపాడు. ఆయన ఎవరు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్.సంక్రాంతి సందర్భంగా చిరంజీవి తాడేపల్లికి విందుకు వెళ్లినప్పుడే ‘మేఘ’ స్కెచ్ బయటపడింది

 

ఇప్పుడు ప్రభాస్, మహేష్ స్పెషల్ ఫ్లైట్ వెక్కటం వెనుక అదే స్కెచ్ ఉందని టాలీవుడ్ టాక్. ఎప్పుడూ బయటకు రాని ప్రభాస్, మహేష్ చాలా అసౌకర్యంగా మీడియా ముందు కనిపించారు. రాజకీయాల్లోకి బలవంతంగా లాగుతున్నారు అనే ఫీల్ వాళ్ళ మొఖాల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. వాళ్ళు ఇద్దరూ ఫ్లైట్ ఎక్కుతారని చిరుకు చివరి నిమిషం వరకు తెలియదు. ఆ విషయం ఆయనే బేగంపేట విమానాశ్రయం కు చేరుకున్నప్పుడు చెప్పాడు. అంటే, చిరంజీవికి ఏమీ తెలియకుండా అంతా నడిచింది. ఫ్లైట్ ప్రయాణం చేయాలి అంటే ముందుగా పేర్లు చెప్పాలి. పైలెట్ అన్నీ చూసుకుంటాడు. సొంత ఫ్లైట్ అయిన ముందుగా ప్రయాణ వివరాలు చెప్పాలి. ముందస్తు అనుమతి ఉంటేనే సెలెబ్రిటీ అయిన ప్రయాణం చేయాలి. ఖాళీగా ఉందని ఎవరినైనా ఎక్కించు కోవడానికి లేదు. ఇంత తతంగం ఉంటే , చిరుకు తెలియకుండా ప్రభాస్, మహేష్ ను ఫ్లైట్ ఎక్కించిన మహాబాహుబలి ఎవరు అనేది పెద్ద ప్రశ్న. బహుశా వర్మ అదే యాంగిల్ లో ట్వీట్ పొడిచాడు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఉన్న అపరిచితుడు వివరాలకు లాగితే టాప్ సీక్రెట్స్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.