Site icon HashtagU Telugu

RGV Tweet : వ‌ర్మ మ‌ళ్లీ ఏసేశాడు. ఈ సారి టార్గెట్ ఎవ‌రంటే..?

Kodai Varma

Kodai Varma

రామ్‌గోపాల్ వ‌ర్మ సెటైర్ వేశాడంటే ఎవ‌రిమీద వేశాడు, ఎందుకు వేశాడు, ఏ ఉద్దేశంతో వేశాడో తెలుసుకోవ‌డం చాలా క‌ష్టం. కానీ.. తాను అనుకున్న‌ది మాత్రం అనుకున్న‌ట్టు స్ట్ర‌యిట్‌గా దింపేస్తుంటాడు అది ఏ విష‌య‌మైనా స‌రే. తాజాగా మీడియాలో గుడివాడ‌లో కొడాలి నాని ఆధ్వ‌ర్యంలో సంక్రాంతి సంబ‌రాలు గోవా స్ట‌యిల్‌లో జ‌రిగాయంటూ వ‌స్తున్న ప్ర‌చారంపై కూడా వర్మ త‌న‌దైన స్ట‌యిల్‌లో స్పందించాడు

 

సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహించారని రెండు రోజులుగా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, దీనికి సంబంధించి డైర‌క్ట‌ర్ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. గుడివాడ‌ను అత్య‌ద్భుతంగా డెవ‌ల‌ప్ చేస్తున్న కొడాలి నానికి తాను మ‌ద్ద‌తు తెలుపుతున్నాన‌ని, కాసినోలు వద్దంటూ గోల చేస్తున్న‌వారంతా పాత‌కాలం వాళ్లంటూ సెటైర్లు వేశాడు

దాని త‌ర్వాత వ‌ర్మ మ‌రో ట్వీట్ కూడా చేశాడు. కేసీనోలు కావాల‌నుకున్న గుడివాడ వాళ్లంద‌రూ గోవా వెళ్తార‌ని, గోవా వాళ్లెవరూ గుడివాడ రారంటూ కామెడీ చేశాడు. గుడివాడను ప్యారిస్, లండన్, లాస్ వెగాస్ వంటి నగరాల తరహాలో మంత్రి కొడాలి నాని అభివృద్ధి చేస్తున్నారని పంచ్‌లు వేశారు.