Site icon HashtagU Telugu

RGV : చిరంజీవికి సపోర్ట్ పలికిన వర్మ..వీడు ఎవడికి అర్ధం కాడు

Rgv Support To Chiranjeevi

Rgv Support To Chiranjeevi

సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ (RGV) గురించి ఎంత చెప్పిన తక్కువే..కెరియర్ మొదట్లో గొప్ప గొప్ప సినిమాలు చేసి ఎంతో పేరు తెచ్చుకున్న వర్మ..వివాదాల్లో (Controversy) కూడా అంతకు రెట్టింపు పేరే తెచ్చుకున్నారు..తెచ్చుకుంటేనే ఉన్నారు. వర్మ ను తిట్టని వారే లేరు..పొగిడే వారు లేకపోలేదు. కొంతమంది అయితే వివాదాల ద్వారానే అభిమానులు అయినవారు కూడా ఉన్నారంటే అది కేవలం వర్మకే చెల్లింది. ప్రతి విషయంలో వేలుపెడుతూ..వివాదాలను కొనితెచ్చుకోవడం లో వర్మ దిట్ట. ఎవర్ని ఎప్పుడు పొగుడుతాడో..ఎవరి ఎప్పుడు తిడతాడో ఆయనకే తెలియదు..ఆ క్షణమే అవతలి వ్యక్తిని పొగిడి..మరుక్షణమే అవమానించేలా ట్వీట్స్ పెట్టడం చేస్తుంటారు. కేవలం ప్రెస్ మీడియా లలోనే కాడు సోషల్ మీడియా (RGV Twitter) లోను వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ నిత్యం వార్తల్లోఉంటారు. ఇక తన సినిమా ప్రమోషన్ (Movie Publicity) విషయంలో వర్మ తర్వాతే ఎవరైనా..చాలామంది దర్శక , నిర్మాతలు తమ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు కోట్ల ఖర్చు చేస్తూ భారీ ఈవెంట్స్ , టూర్స్ , పలు షోస్ , ఇంటర్వూస్ ఇస్తూ నానా హడావిడి చేస్తుంటారు. కానీ వర్మ మాత్రం అలాకాదు సింగిల్ గా..సింగిల్ రూపాయి ఖర్చు లేకుండా జస్ట్ ట్విట్టర్ తోనే ఎంత పబ్లిసిటీ రావాలో అంత రప్పించుకుంటారు. పబ్లిసిటీ చేయడంలో వర్మను మించినవారు లేరంటే నమ్మండి.

ప్రస్తుతం ఈయన తెరకెక్కించిన వ్యూహం (Vyuham ) మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జగన్ (CM Jagan) కు సపోర్ట్ గా ఈ మూవీ తెరకెక్కించారని మొదటి నుండి వినిపిస్తున్న మాటే. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ (Vyuham Trailer ) విడుదల చేసి రాజకీయాల్లో పెను సంచలనం రేపారు. ఇదిలా ఉంటె తాజాగా ఈయన మెగాస్టార్ చిరంజీవి కి సపోర్ట్ గా మాట్లాడి మరోసారి మెగా అభిమానులు ఆశ్చర్య పరిచారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాజాగా చిరంజీవి ..వైసీపీ పార్టీ ఫై నేతల ఫై చేసిన కామెంట్స్ పట్ల స్పందించారు.

ఇండస్ట్రీ బయట ఉండేవాళ్లకి సినిమా బిజినెస్, రెమ్యునరేషన్ల మీద అవగాహన ఉండదని, దీని విషయంలో చిరంజీవి (Chiranjeevi Comments) చేసిన వాక్యాలకు ఏకీభవిస్తా అన్నారు. రెమ్యునరేషన్ అనేది మార్కెట్ రియాలిటీ. నిర్మాత, హీరోకి మధ్య జరిగే అంతర్గత ఒప్పందం. మార్కెట్‌లో ఎంత రికవరీ ఉంది, సినిమాకు ఎంత అవుతుంది, ఆ మధ్యలో వచ్చే మొత్తం మీద రెమ్యునరేషన్ డిపెండ్ అవుతుంది. బయటవాళ్లకు అది తెలీదు. విజయసాయి రెడ్డి ఏ కాంటెక్ట్స్‌లో చెప్పారో నాకు తెలీదు. ఒక సినిమాకు చెప్పారా, మొత్తం ఫిలిం ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని చెప్పారా నేను చూడలేదు. చిరంజీవి చెప్పింది కరెక్ట్. రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవి చెప్పిన దానితో నేను ఏకీభవిస్తాను. ప్రొడ్యూసర్, యాక్టర్‌ మధ్య జరిగే రెమ్యునరేషన్ అనే అంశాన్ని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు.

రెమ్యునరేషన్ (Hero Remuneration)ఎక్కువ ఇవ్వడం వల్ల ఇండస్ట్రీ నష్టపోతుంది అనడంలో అర్థం లేదు. అది నిర్మాతలు, బయ్యర్లు చూసుకుంటారు. వాళ్ల జోబుల్లోంచి డబ్బులు ఖర్చుపెడుతుంటే వాళ్లకు ఎక్కువ తెలుస్తుందా? మనకు ఎక్కువ తెలుస్తుందా? సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి రెమ్యునరేషన్‌కి సంబంధం ఉండదు. ఈ హీరో సినిమా హిట్ అయితే ఇంత డబ్బు వస్తుంది అనే బేస్ మీద రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటుంది. టికెట్ ధర పెంచినప్పుడు ఒక వేళ అంత డబ్బు పెట్టలేకపోతే ప్రేక్షకుడు సినిమా చూడడు. ఈ షర్ట్ నేను వెయ్యి రూపాయలు అని చెప్పాననుకోండి.. మీకు నచ్చితే కొంటారు, నచ్చకపోతే కొనరు. సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏదైనా మార్కెట్ డిమాండ్ అండ్ సప్లయ్ మీదే ఆధారపడి ఉంటుంది. హీరోలు చాలా ఎక్కువ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు అనేది చాలా పెద్ద బూతు’ అని వర్మ క్లారిటీ ఇచ్చారు. ఇక వర్మ మాటలు విన్న మెగా అభిమానులు (Mega Fans) మాత్రం వీడు ఎవరికీ అర్ధం కాడు అని మాట్లాడుకుంటున్నారు.

Read Also: Hello Nara Lokesh : తన లవ్ స్టోరీ ని పబ్లిక్ గా బయటపెట్టిన నారా లోకేష్..

Exit mobile version