Site icon HashtagU Telugu

RGV : అజ్ఞాతవాసి సినిమాను పోలుస్తూ పవన్ ఫై వర్మ సెటైరికల్ ట్వీట్..

Pawan Varma

Pawan Varma

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) ..పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ను అస్సలు వదిలిపెట్టడం లేదు..ముందు నుండి మెగా ఫ్యామిలీ ఫై ఫోకస్ చేస్తూ వస్తున్న వర్మ..పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గరి నుండి మరింత ఫోకస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఏంచేసినా..దానిపై సెటైరికల్ గా స్పందిస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా జనసేన లిస్ట్ ప్రకటన వచ్చిన దగ్గరి నుండి పవన్ ఫై విమర్శలు , ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే “23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు….25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారు…అందుకే మధ్యే మార్గంగా 24 ” ఇచ్చారంటూ కామెంట్స్ చేసారు. మరో ట్వీట్ లో 24 అసెంబ్లీ సీట్లతో పాటు 3 పార్లమెంట్ స్థానాలిచ్చారంటూ పవన్ మాట్లాడుతున్న క్లిప్ కూడా ఆర్జీవీ పోస్ట్ చేశారు. ఒక్కో పార్లమెంట్‌లో 6-7 అసెంబ్లీ స్థానాలుంటాయని, జనసేకు తక్కువ సీట్లు వచ్చినట్టు భావించకూడదదని, ఈ లెక్కన చూస్తే జనసేనకు 45 సీట్లు ఇచ్చినట్టేనంటూ కొత్త వివరణ ఇవ్వడంపై మరో సెటైర్ వేశారు. రెండు లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానంతో అద్భుతమైన లాజిక్ తీశారంటూ కామెంట్ పెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఒకవేళ పవన్ చెప్పినట్టు పార్లమెంట్ పరిదిలోని ఏడేసి అసెంబ్లీ స్థానాల్లో కూడా పోటీ చేసినట్టే భావించాల్సి వస్తే టిడిపి, వైసీపీ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసినట్టు భావించాల్సి ఉంటుందని ప్రశ్నించారు. అసలీ లెక్కకు ఏమైనా తిక్కుందా అని సెటైర్ వేశారు. ఈరోజు పీకే కోసం బాధపడినంతగా ఎవరికోసం బాధపడలేదన్నారు. జనసేన పరిస్థితి చూసి దిగులు కలుగుతుందన్నారు.

 

తాజాగా మరో ట్వీట్ చేసారు. ‘గత ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవకపోవడంతో మరిన్ని సీట్లు డిమాండ్ చేయలేకపోయానని పవన్ అంటున్నారు. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిందని తర్వాతి సినిమాను కొన్ని థియేటర్లకే పరిమితం చేయలేదు కదా.. సినిమాలతో పోలిస్తే రాజకీయ స్థితిపై పవన్ నమ్మకంగా లేడు’ అని పేర్కొన్నారు. ఇలా వరుసగా ట్విట్టర్ వేదికగా పవన్ ఫై సెటైర్లు కురిపిస్తుండడం జనసేన శ్రేణులు , అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఎదురు దాడి చేద్దామన్న కానీ వర్మ చెప్పిందట్లో నిజం కూడా ఉంది కదా అని ఆగిపోతున్నారు. ఏది ఏమైనప్పటికి జనసేన 24 సీట్లు మాత్రమే దక్కించుకోవడం పట్ల పార్టీ శ్రేణులు కూడా తట్టుకోలేకపోతున్నారు.

Read Also : Gruha Jyothi : ‘గృహజ్యోతి’ స్కీం హైదరాబాద్​లో 11 లక్షల మందికే.. ఎందుకు ?