RGV Announces Movie: రాజకీయ కుట్రలపై రామ్ గోపాల్ వర్మ కొత్త మూవీ..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం కలిసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పొలిటికల్ డ్రామాపై సినిమా తీయడానికి యాక్షన్ లోకి దిగారు.

Published By: HashtagU Telugu Desk
Ram Gopal Vermas anticipatory bail pleas adjourned

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం కలిసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పొలిటికల్ డ్రామాపై సినిమా తీయడానికి యాక్షన్ లోకి దిగారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన కొత్త సినిమాపై ట్వీట్ తో పాటు ఓ ఆడియోను రిలీజ్ చేశారు. త్వరలో వ్యూహం అనే రాజకీయ సినిమా తీస్తానని ఆర్జీవీ తన ట్వీట్ లో తెలిపారు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించినదే వ్యూహం కథ అని చెప్పారు.

గురువారం దర్శకుడు ఆర్జీవీ ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులను చిత్రీకరించే ‘వ్యూహం’, ‘శపథం’ టైటిల్‌లతో రెండు భాగాలుగా చిత్రాన్ని ప్రకటించారు. ఇది బయోపిక్ కాదని.. నిజమైన పిక్ అని పేర్కొన్న ఆర్జీవీ, ఓ వ్యక్తి చేసిన రాజకీయ కుట్రలకు సంబంధించిన అన్ని అంశాలను ఈ చిత్రంలో ప్రదర్శిస్తారని అన్నారు. ఈగో, యాంబిషన్ మధ్య జరిగే పోరు చుట్టూ కథ తిరుగుతుందని చెప్పారు. అయితే ఈ సంచలన దర్శకుడు ఎవరిపై సినిమా చేయబోతున్నాడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఏది ఏమైనప్పటికీ వైఎస్‌ఆర్‌సిపి ప్రభంజనం ఉన్న రోజుల్లో పార్టీకి అడ్డంకులు సృష్టించిన ప్రత్యర్థులకు సినిమాలు హిట్టయ్యేలా కనిపిస్తున్నాయి. ఆర్జీవీ ఎప్పటిలాగే దీనికి సీక్వెల్‌ను శపథం అనే టైటిల్‌తో ప్రకటించారు. ‘శపథం’ సినిమాతో జనాలు షాక్‌కు గురవుతారని అన్నారు. మరి ఈ దర్శకుడు సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి. వంగవీటి నిర్మాత దాసరి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

  Last Updated: 28 Oct 2022, 10:44 AM IST