రివర్స్ గేమ్ (Reverse Politics) రాజకీయాల్లోనూ వైసీపీ మొదలు పెట్టింది. ప్రత్యర్థులను బలహీనపరచడానికి పరోక్ష పద్ధతులను ఎంచుకుంటోంది. కోవర్టిజంను నమ్ముకున్నట్టు తాజా పరిణామాల ఆధారంగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లతో టీడీపీని బలహీనపరచాలని రంగంలోకి దించింది. ఆ విషయాన్ని రఘురామక్రిష్ణంరాజు బయటపెట్టారు. లోకేష్ పాదయాత్రలో హఠాత్తుగా వెలిసిన జూనియర్ పోస్టర్ల వెనుక వైసీపీ హస్తం ఉందని ఆయన అనుమానిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఆ విధంగా భావిస్తోంది.
లోకేష్ పాదయాత్రలో హఠాత్తుగా వెలిసిన జూనియర్ పోస్టర్ల వెనుక వైసీపీ (Reverse Politics)
కోవర్టిజం (Reverse Politics) అనేది యుద్ధంలో ఒక భాగం. ఎన్నికల ప్రక్రియలోనూ దాన్ని ప్రస్తుత రాజకీయ పార్టీలు ఉపయోగిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది. తాజాగా వైసీపీ కూడా టీడీపీలో అలాంటి బీజం వేయాలని ప్రయత్నించినట్టు రఘరామక్రిష్ణం రాజు అభిప్రాయం. అందుకే, జూనియర్ పోస్టర్లను యువగళం యాత్రలో కనిపించాయని భావిస్తున్నారు. ఆ పోస్టర్లను వైసీపీ బ్యాచ్ వేసిందని చెబుతున్నారు. అందుకు నిదర్శనంగా కొన్ని విషయాలను ఆయన చెబుతున్నారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ పోస్టర్లను వేస్తే, హరిక్రిష్ణ ఫోటో ఖచ్చితంగా ఉంటుందని లాజిక్ తీశారు. యువగళం యాత్ర సందర్భంగా వెలసిన జూనియర్ పోస్టర్లలో హరిక్రిష్ణ ఫోటో లేదు కనుక వైసీపీ బ్యాచ్ వేసిన పోస్టర్లు గా ఆయన వివరిస్తున్నారు.
ఎన్టీఆర్, చంద్రబాబు మధ్య ఏదో గ్యాప్ ఉందని
వాస్తవంగా జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు మధ్య ఏదో గ్యాప్ ఉందని చాలా కాలంగా నడుస్తోన్న చర్చ. కుమారుడు లోకేష్ ను రాజకీయ వారసునిగా ప్రతీష్టించడానికి జూనియర్ ను తొక్కేస్తున్నారని బాబు మీద ఉన్న అపవాదు. కానీ, కుటుంబం పరంగా అందరూ కలిసి ఉంటారు. జూనియర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుటికిప్పుడు రాజకీయాల్లోకి రావడానికి ఆయన సిద్ధంగా లేరు. అలాగని చంద్రబాబు బలవంతంగా తీసుకురాలేరు. జూనియర్ అభిమానులు మాత్రం తరచూ రాజకీయాల్లోకి ఆయన రావాలని కోరుకుంటున్నారు. అప్పుడప్పుడు పోస్టర్లు వేసి చంద్రబాబు సభల్లో నినాదాలు చేస్తున్నారు. యువగళం మొదలైనప్పటి నుంచి జూనియర్ పోస్టర్ల హడావుడిగానీ, నినాదాలుగానీ లేవు. హఠాత్తుగా పోస్టర్లు ఇప్పుడు రావడం వెనుక వైసీపీ కుట్ర (Reverse Politics) ఉందని టీడీపీ భావిస్తోంది.
ఎన్టీఆర్ పోస్టర్లతో టీడీపీని బలహీనపరచాన్ని రఘురామక్రిష్ణంరాజు బయటపెట్టారు
రాబోవు ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ ముందుకెళుతోన్న వైసీపీ ఇప్పుడు జూనియర్ ను రివర్స్ యాంగిల్ లో వాడేస్తోంది. ఆయన మాత్రం టీడీపీలో ఉన్నానంటూ చెబుతున్నారు. జీవితకాల సభ్యత్వం కూడా టీడీపీలో ఉంది. కట్టెకాలే వరకు తాతాగారు పెట్టిన పార్టీలో ఉంటాను. తన మద్ధతు ఎప్పుడూ టీడీపీకి ఉంటుందని పలుమార్లు చెప్పారు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల మీద దృష్టి పెట్టారు. అవసరమైనప్పుడు వస్తానని కూడా జూనియర్ చెప్పారు. కానీ, చంద్రబాబు, జూనియర్ మధ్య పెద్ద గ్యాప్ ఉందని వైసీపీ చూపించడానికి ప్రయత్నం చేస్తోంది. తద్వారా జూనియర్ అభిమానుల ఓటు బ్యాంకును లాగేసుకోవాలని (Reverse Politics)తాపత్రయ పడుతోంది.
Also Read : TDP Jumping Leaders : అమరావతి నేతల పోటు!?
యువగళం పాదయాత్ర లోకేష్ చేస్తున్నారు. తొలి రోజుల్లో తడబాటు కనిపించినప్పటికీ ప్రస్తుతం రాటుతేలారు. అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని మమేకం అవుతున్నారు. ఆయన పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తుందని టీడీపీ భావిస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు ఎంట్రీ ఇచ్చిన లోకేష్ కు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ల కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా వైసీపీ చేస్తోన్న గందరగోళంగా భావిస్తూ టీడీపీ క్యాడర్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అధిష్టానం చేస్తోంది. దానికి రఘురామక్రిష్ణంరాజు కూడా గళాన్ని జోడించారు. దీంతో వైసీపీ కుట్రను తిప్పికొట్టగలమని టీడీపీ సోషల్ మీడియా నమ్మకంగా ఉంది
Also Read : TDP Scheme : మగువకు `మహాశక్తి` చంద్రబాబు