Site icon HashtagU Telugu

CBN Arrest: చంద్రబాబు జాతీయ నాయకుడు.. గుర్తు పెట్టుకో కేటీఆర్

Cbn Arrest

Cbn Arrest

CBN Arrest: చంద్రబాబు ఒక్క రాష్ట్రానికో, ప్రాంతానికో పరిమితం కాదని, అయన జాతీయస్థాయిలో ప్రభావం చూపిన నాయకుడని కొనియాడారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్ కు చురకలంటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్టానికి పరిమితం కాదు. దేశరాజకీయాల్లో ప్రభావం చూపిన నాయకుడు. అటువంటి నాయకుడు అరెస్ట్ అయి జైలులో ఉంటే నిరసనలకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉందని, జాతీయస్థాయిలో చక్రం తిప్పిన నాయకుడి కోసం చేస్తున్న నిరసనలను అడ్డుకుంటే ఎలా అంటూ రేవంత్ ప్రశ్నించారు.

బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రకు చెందిన కమ్మవారి ఓట్లు కావాలి కానీ వారికీ నిరసన తెలిపే సామజిక హక్కు లేదా? వాళ్లకు పర్మిషన్ ఇవ్వరా అంటూ ఫైర్ అయ్యారు. మీరు అన్నట్టు చంద్రబాబు అరెస్ట్ అంశం తెలంగాణకు సంబంధం లేదనుకుంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాలోని వైట్ హౌస్ ముందు నిరసన తెలిపినప్పుడు ఈ సోయి ఏమైందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి, అమెరికాకు సంబంధం ఏంటని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికలు మీరు అడ్డుకున్న ఆంధ్ర ప్రజలు మీ చెంపలు వాయిస్తారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్స్ బీఆర్ఎస్ పార్టీకి కర్ర కాల్చి వాత పెడతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో తెలంగాణాలో సెటిల్ అయిన ఆంధ్రప్రజలు, చంద్రబాబు మద్దతుదారులు హైదరాబాద్ లో నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. చంద్రబాబు అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. నిరసనకారుల్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడంతో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేశారు. నిరసనకు మద్దతు ఇవ్వాలని కోరాడు.

చంద్రబాబు అరెస్టుతో తెలంగాణ ఎం సంబంధం అని నిలదీశారు కేటీఆర్. చంద్రబాబు అరెస్టు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినదని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ తెలంగాణ సమస్య కాదని, అది కేవలం రెండు పార్టీలకు సంబందించిన ఇష్యూగా చెప్పారు. తెలంగాణ శాంత్రిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని తెగేసి చెప్పారు మంత్రి కేసీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలపై నారా లోకేష్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.శాంతియుత నిరసనలు చేశారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ ప్రవర్తించలేదని లోకేష్ అన్నాడు.

Also Read: Vijaya Nirmala : విజయ్ నిర్మల తన ఆస్తుల్లో.. సగం నరేష్‌కి.. మరో సగం ఇంకో హీరోకి..?

Exit mobile version