YS Sharmila : షర్మిల విషయంలో నోరు జారిన సీఎం రేవంత్

  • Written By:
  • Publish Date - January 7, 2024 / 04:51 PM IST

వైస్ షర్మిల ..ఈ పేరు నేషనల్ మీడియా తో పాటు లోకల్ మీడియా లో సైతం గత వారం రోజులుగా మారుమోగిపోతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గరి నుండి ఏదొక రకంగా షర్మిల పేరు చక్కర్లు కొడుతూనే ఉంది. తెలంగాణ లో పోటీ చేస్తుందో లేదో..ఆ తర్వాత తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తుందో లేదో అని ..కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ లో ఎప్పుడు చేరుతుందో అని..ఇలా పలు రకాలుగా పలు విధాలుగా ఆమె గురించి మాట్లాడుకుంటూ వచ్చారు.

ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో తన YSRTP ని విలీనం చేయడం..ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం తో..ఇప్పుడు నేషనల్ మీడియా లో సైతం ఆమె వైరల్ గా మారింది. ప్రస్తుతం అంత మాట్లాడుకునేది ఒకటే..షర్మిల కు ఏపీ కాంగ్రెస్ బాధ్యత ఇస్తుందా..లేదా..? ఇస్తే ఎప్పుడు ఇస్తుంది..? షర్మిల ప్రభావం మిగతా పార్టీలఫై ఎంత మేర పడుతుంది..? ఎంతమంది కాంగ్రెస్ లో చేరతారు..? ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవాన్ని షర్మిల తీసుకొస్తుందా..? ఇలా ఎవరికీ వారు సామాన్య ప్రజల దగ్గరి నుండి రాజకీయ వర్గాల వరకు అంత మాట్లాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసి అందరి సందేహాలకు చెక్ పెట్టారు. తమ పార్టీకి చెందిన షర్మిలను ఏపీ నాయకురాలు, ఏపీ కాంగ్రెస్ నాయకురాలు అని పేర్కొన్నారు. అధిష్టానం తనకు ఏమైనా హింట్ ఇచ్చిందో లేదో కానీ.. రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని, ఆమెకు ఏపీ పీసీసీ బాధ్యతలు సైతం ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్.. షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల అని సంభోదించారు. తెలంగాణకు ఎన్నికలకు ముందు సైతం షర్మిల ఏపీలో రాజకీయాలు చేసుకోవడం బెటర్ అని పలుమార్లు రేవంత్ అన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరినా ఏపీలో పార్టీ కోసం పనిచేస్తే ఫలితం ఉంటుందనేవారు. తాజాగా సైతం షర్మిలను ఏపీకి చెందిన నాయకురాలు, ఏపీ కాంగ్రెస్ నాయకురాలు అని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాతో పాటు నేతల్లోనూ చర్చకు దారితీశాయి. శనివారం షర్మిల..రేవంత్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాల్సిందిగా రేవంత్ ను షర్మిల కోరడం జరిగింది. షర్మిల కల్సిన కొద్దీ గంటలకే ఏపీ కాంగ్రెస్ నాయకురాలు అని చెప్పడం విశేషం. ఏది ఏమైనప్పటికి ఏపీలో షర్మిల ప్రభావం గట్టిగా ఉంటుందని అంత నమ్ముతున్నారు.

Read Also : Satyavedu MLA Adimulam : మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన వైసీపీ దళిత ఎమ్మెల్యే..