ఏపీ పాఠశాల విద్యాశాఖలో మౌలిక సలహాదారు పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. ఇక నుంచి తెలంగాణ విద్యా వ్యవస్థకు సేవలు అందిస్తాయనని తెలిపారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. తెలంగాణలో విద్యా, వైద్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ..అక్కడి పరిస్థితి మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తానని లేఖలో పేర్కొన్నారు. తన సేవలు తెలంగాణలో అవసరం ఉన్నాయన్నారు. గత 3ఏళ్లుగా ఏపీ సర్కార్ లో పాఠశాల విద్యాశాఖ సలహాదారుగా పనిచేయడం మంచి అనుభూతిని మిగిల్చిందన్నారు.
కాగా జగన్ నాడు నేడుకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు మురళి ప్రశంసించారు. తన స్వరాష్ట్రం తెలంగాణలో వైద్య, విద్య పరిస్థితులు సరిగ్గా లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన సేవలుపూర్తిగా తెలంగాణలోనే అందించేందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందని లేఖలో వెల్లడించారు.