Site icon HashtagU Telugu

Restrictions for Amaravati farmers: అమరావతి రైతులకు ఆంక్షలు

Amravathi

Amravathi

అమరావతి రైతులకు హైకోర్టు కొన్ని ఆంక్షలతో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. రోజుకు 600 మంది మించకుండా యాత్ర ఉండాలని సూచించింది. కేవలం రెండు వాహనాలు మాత్రమే ఉండాలని కండిషన్ పెట్టింది. అదే సమయంలో లా అండ్ ఆర్డర్ కాపాడుతూ పోలీస్ మద్దతు ఇవ్వాలని సూచించింది.

రాజమండ్రి లో జరిగిన పాదయాత్ర సందర్భంగా రైతుల మీద వైసీపీ నాయకులు, క్యాడర్ దాడి చేసిన విషయం విదితమే. అంతే కాకుండా గోదావరి బ్రిడ్జిని మూసివేశారు. ఈ అంశాలపై రైతులు హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారించిన కోర్ట్ శుక్రవారం కొన్ని ఆంక్షలు పెడుతూ పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది.