తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి (Renuka Chowdhury) మాజీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్ (jagan)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి మహిళలపై పై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె జగన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. “వీడు పుట్టడమే దౌర్భాగ్యం. పుట్టిన రెండో నిమిషానికే విజయమ్మ గొంతునొక్కేసి ఉండాల్సింది” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహం నింపుతున్నాయి. అంతేకాక జగన్‌కు మానసిక చికిత్స అవసరమని వ్యాఖ్యానించి రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు.
AP Weather: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల అలెర్ట్ – వచ్చే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి
అమరావతిలోని మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన సాక్షి ఛానల్ జర్నలిస్టులను తీవ్రంగా ఖండించిన రేణుకా చౌదరి, వారి పైన మరియు ఛానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “మహిళలు వేసుకున్నవి గాజులు కావు, విష్ణు చక్రాలు” అంటూ ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరచారు. జగన్‌కు ధైర్యం ఉంటే అమరావతిలోకి రావాలంటూ సవాల్ విసిరారు. అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. సాక్షి పత్రిక మరియు ఛానల్‌ను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు.
Nicholas Pooran : 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నికోలస్ పూరన్
రేణుకా చౌదరి జగన్ గతంలో ప్రదర్శించిన అధికారదాహాన్ని గుర్తుచేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంత్యక్రియలు జరగకముందే సంతకాల సేకరణ ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ జగన్ తీరును దున్నపోతు మీద వర్షం పడినట్లు వర్ణించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై వస్తున్న వ్యాఖ్యల పట్ల ఉన్న వ్యవహార రీతిని, ఇప్పుడు జగన్ నిశ్శబ్దంగా ఉండడాన్ని కుండ బద్దలు కొట్టారు. “జగన్ బతుకేమిటో నాకు బాగా తెలుసు” అంటూ చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తోంది.