Site icon HashtagU Telugu

Pawan Kalyan Win : పవన్ కళ్యాణ్ గెలుపు ఫై రేణు దేశాయ్ ట్వీట్

Pawan Renu

Pawan Renu

పిఠాపురంలో జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ దాదాపు 70 వేల మెజార్టీ తో విజయం సాధించడం పట్ల యావత్ అభిమానులు , జనసేన శ్రేణులు , సినీ ప్రముఖులు సంబరాలు చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా తమ అభినందనలను తెలియజేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి , నితిన్ , అల్లు అర్జున్ తదితరులు ట్వీట్స్ చేయగా..తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పవన్ విజయాన్ని చీర్‌ చేస్తూ ఆసక్తికరంగా కూతురు ఆద్య వీడియోను షేర్‌ చేసింది రేణు. జనసేన పార్టీ గ్లాస్‌ గుర్తుకు సింబాలిక్‌గా ఆద్య వీడియో షేర్‌ చేశారు. ఇందులో ఆద్య గ్లాస్‌లో కూల్‌ డ్రింగ్‌ తాగుతూ కనిపించింది. దీనికి “ఆద్య, అకీరాలకు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు నుండి ఏపీ రాష్ట్ర ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను” అంటూ మాజీ భర్త పవన్‌ విజయంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ వీడియోకి రేణు ఇచ్చిన బ్యగ్రౌండ్‌ సాంగ్‌ గుస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. మహాంకాళి స్పిర్చివల్‌ మెలోడి సాంగ్‌ యాడ్‌ చేస్తూ పవన్ విజయాన్ని ఇలా స్వాగతించారు. దీంతో ఆమె పోస్ట్‌ పవర్‌ స్టార్‌ అభిమాలను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక చిరంజీవి సైతం పవన్ , చంద్రబాబులకు విషెష్ చేయడం జరిగింది.

‘డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేసారు.

అలాగే చంద్రబాబు కు సైతం చిరంజీవి బెస్ట్ విషెష్ అందించారు.

ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు.👏👏 💐💐 ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను. !

ఇక పిఠాపురం బరిలో నిలుచున్న పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ తో విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఇక ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం లాంఛనమే.

Exit mobile version