Site icon HashtagU Telugu

CBN : జగన్ కు మరో షాక్..ఆ పేరు కూడా తొలగించిన చంద్రబాబు

Navaratna Houses For All Th

Navaratna Houses For All Th

అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ (NDA Govt)..వరుసగా మాజీ సీఎం జగన్ (EX CM Jagan కు షాక్ లు ఇస్తూనే ఉంది. జగన్ సొంత నిర్మాణాలు, అక్రమ ఆస్తులపై అరా తీస్తూనే..మరోపక్క ఆ పార్టీ నేతలు గడిచిన ఐదేళ్లలో చేసిన అక్రమాలు , దోపిడీలు , కబ్జా లు ఇలా అంటిని బయటకు తీస్తూ ..కేసులు పెడుతూ చెమటలు పట్టిస్తుంది. ఇదే కాదు జగన్ ప్రవేశ పెట్టిన పథకాల పేర్లు సైతం మార్చేస్తుంది. ఇప్పటికే పలు పధకాల పేర్లు మార్చిన చంద్రబాబు..తాజాగా గృహ నిర్మాణ పథకానికి ఉన్న పేరును సైతం తొలగించాలని ఆదేశాలు జారీ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పేరును కూటమి సర్కార్ తొలగించింది. పూర్తైన ఇళ్లకు సంబంధించి పాస్ పుస్తకాలు, సర్టిఫికెట్లపై జగన్ బొమ్మలు, వైసీపీ రంగులు వేయొద్దని, స్వాగత ద్వారాలపై పేర్లు నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. కొత్త పేర్లు పెట్టే వరకు 2019కి ముందున్న పేర్లు కొనసాగించాలని పేర్కొంది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లను మార్చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ రూరల్‌ హౌసింగ్‌, ఎన్టీఆర్‌ స్పెషల్‌ హౌసింగ్‌ పథకాలను గత ఐదేళ్లూ వైఎ్‌సఆర్‌ రూరల్‌ హౌసింగ్‌, వైఎ్‌సఆర్‌ స్పెషల్‌ హౌసింగ్‌ పేర్లతో అమలు చేశారు. ఈ రెండు పథకాలను మళ్లీ పాత పేర్లతోనే అమలు చేయనున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఇక మీదట ‘వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌’ (ఓటీఎ్‌స)గా అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన లే-అవుట్ల వద్ద ‘వైఎ్‌సఆర్‌ జగనన్న కాలనీ’ పేరుతో స్వాగత ద్వారాలు (ఆర్చిలు) నిర్మించారు. ఇక మీదట ఈ పేర్లను కూడా నిలిపివేయనున్నారు.

Read Also : Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు