జగన్ (Jagan) పుట్టిన రోజు , అలాగే క్రిస్మస్ పండగ నేపథ్యంలో విజయవాడ , ఒంగోలు ప్రధాన కూడళ్లలో వెలిసిన కొన్ని ప్లెక్సీ లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. జగన్ ను ఏసుక్రీస్తు గా పోలుస్తూ పోస్టర్లను డిజైన్ చేయడం ఫై నెటిజన్లతో పాటు స్థానికులు , క్రెస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతే కాదు టీడీపీ , జనసేన శ్రేణులు సైతం మండిపడ్డారు. ఈ పోస్టర్ లలో ఓ మూలన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌తో పాటు నక్క చిత్రాన్ని చిత్రించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
పలు మీడియా చానెల్స్ లలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరగడం తో అధికారాలు దిగొచ్చారు. గుట్టు చప్పుడు కాకుండా జగన్ ఫ్లెక్సీలను వైసీపీ నేతలే దగ్గరుండి మరీ తొలగించారు. గతంలో కూడా పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటూ వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. దీనిపై అప్పట్లో పలువురు విమర్శించారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న సీఎం జగన్ పేదవాడా? అంటూ సెటైర్లు వేయడంతో ఆ ఫ్లెక్సీలను అప్పట్లో ఆగమేఘాల మీద తొలగించారు. ఐప్యాక్ డైరెక్షన్‌లో ఫ్లెక్సీలు వేసి వైసీపీ మరోసారి అభాసుపాలు అయ్యింది.
ఇక పోస్టర్ లో ఏముందనేది చూస్తే..విభిన్న వస్త్రదారణతో సీఎం జగన్ చిత్రం వేశారు. జగన్‌ను చూస్తూ చేతులెత్తి మోక్కుతున్న చిన్నారిని ఎత్తుకున్న తండ్రి తో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయినట్టు పచ్చి అబద్దాలతో ఆ పక్కనే భారీ వైఎస్‌ఆర్ విగ్రహాన్ని కూడా పోస్టర్‌లో కనబడే విధంగా చిత్రికరించారు. అలాగే పోస్టర్‌లో దింసా నృత్యం, హరిదాసు, గంగిరెద్దులాడించే వాడు, పల్లెకారులు, కల్లుగీత కార్మికులు కనపడుతున్నారు.
Read Also : RSS: దేశ కులగణనకు తాము వ్యతిరేకం కాదు: ఆర్ఎస్ఎస్