Religious conversions : మత మార్పిడికి అడ్డాగా టీటీడీ పుష్కరిణి..భక్తులు ఆగ్రహం

టీటీడీ అనుబంధ వేణుగోపాలస్వామి ఆలయ స్కంద పుష్కరిలో మతమార్పిడికి తెరలేపారు.. హిందువుల పవిత్రంగా పూజించే స్నానమాచరించి స్కంద పుష్కరణిలో క్రైస్తవ మత మార్పిడికి బాప్తిజం చేశారు

  • Written By:
  • Publish Date - November 14, 2023 / 01:53 PM IST

ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల (Tirumala) ఇటీవల వరుస వివాదాలతో నిలుస్తుంది. ముఖ్యంగా తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువ అవుతుందని భక్తులు వాపోతున్నారు. తాజాగా టీటీడీ పుష్కరిణినే మత మార్పిడికి అడ్డాగా మార్చడం వివాదాస్పదం అయ్యింది. రీసెంట్ గా మంత్రి రోజా (YCP Minister Roja) ఫొటోగ్రాఫర్‌ టీటీడీ (TTD) నిబంధనలకు విరుద్ధంగా అన్యమత శిలువ గుర్తుతో ఆలయంలోకి రావడం పెద్ద చర్చ కు దారితీసింది. వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు మంత్రి రోజా వచ్చారు. ఆమెతో పాటు తన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ను కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్‌ స్టెయిన్‌ అన్యమత గుర్తు ఉన్న గొలుసుతో గొల్లమండపం ఎక్కారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ఘటన మరవకముందే..తాజాగా చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో టీటీడీ స్కంద పుష్కరిణి (Skanda Pushkarini)లో అపచారం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

కార్వేటి నగరం మండలం టీటీడీ అనుబంధ వేణుగోపాలస్వామి ఆలయ స్కంద పుష్కరిలో మతమార్పిడికి తెరలేపారు.. హిందువుల పవిత్రంగా పూజించే స్నానమాచరించి స్కంద పుష్కరణిలో క్రైస్తవ మత మార్పిడికి బాప్తిజం చేశారు.. ఇది గమనించిన స్థానికులు కొందరు అక్కడికి చేరకుని క్రైస్తవులతో వాగ్వాదానికి దిగారు.. హిందువులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మత మార్పిడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు.. అక్కడి బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. బలవంతంగా మత మార్పిడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Read Also : Dunki Salaar 1 Animal 3 సినిమాలు 3000 కోట్ల టార్గెట్.. గెలిచేదెవరు..?