ఆంధ్రప్రదేశ్‌లోని MB యూనివర్సిటీకు హైకోర్టు పెద్ద ఊరట కల్పించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఈ విశ్వవిద్యాలయం నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపిస్తూ దీని గుర్తింపును రద్దు చేయాలని, విద్యార్థుల నుండి వసూలు చేసిన రూ. 26.17 కోట్ల అదనపు ఫీజును తిరిగి చెల్లించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనితో వర్సిటీ పరిపాలనలో ఆందోళన నెలకొంది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వర్సిటీ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ప్రాథమిక విచారణ అనంతరం APSCHE ఉత్తర్వులపై స్టే ఆర్డర్ జారీ చేసింది.
Yashasvi Jaiswal : ఢిల్లీ గడ్డపై జైస్వాల్ శతకం..!
అంతేకాకుండా, APSCHE ఈ వర్సిటీ పరిపాలనా బాధ్యతలను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (SVU)కి అప్పగించాలని చేసిన సూచనపైనా హైకోర్టు ఆంక్షలు విధించింది. కోర్టు “వర్సిటీ గుర్తింపును రద్దు చేసే ముందు సంబంధిత సంస్థకు స్పష్టమైన వివరణ కోరాల్సింది. కానీ ఏకపక్షంగా చర్యలు తీసుకోవడం సరైన విధానం కాదు” అని వ్యాఖ్యానించింది. APSCHE ఇచ్చిన సిఫార్సులు, ఆదేశాలు ఇంకా తుది నిర్ణయం కానందున వాటిని ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయడమేందుకు అవసరమైందని కోర్టు ప్రశ్నించింది.
“ఇకపై APSCHE జారీ చేసే ఏ ఉత్తర్వులైనా తక్షణమే తమ వెబ్‌సైట్‌లో కూడా అప్లోడ్ చేయాలి” అని ఆదేశించింది. ఈ నిర్ణయం విద్యా రంగంలో పారదర్శకతను పెంపొందించడంలో కీలకమైనదిగా నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు MB యూనివర్సిటీ యాజమాన్యం ఈ తీర్పుతో సంతృప్తి వ్యక్తం చేస్తూ మా సంస్థ అన్ని చట్టబద్ధమైన నిబంధనలను పాటిస్తోంది. విద్యార్థుల హక్కులు కాపాడడమే మా లక్ష్యం” అని ప్రకటించింది. ఈ కేసు తుది విచారణ వచ్చే వారాల్లో జరగనుంది. హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులు రాష్ట్రంలోని ఇతర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు కూడా ఒక మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది.

