ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తూ, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో ఫుడ్ & బివరేజ్ రంగంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు అనుమతి మంజూరు చేసింది. జూన్ 19న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించగా, సంస్థ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది.
Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు బుమ్రా దూరం? అతని స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరంటే?
ఈ పరిశ్రమకు రూ.1622 కోట్ల పెట్టుబడి లభించనున్నదిగా తెలిపిన రిలయన్స్ సంస్థ, ఓర్వకల్లు సమీపంలో 80 ఎకరాల భూమిపై పరిశ్రమను స్థాపించనుంది. APIIC ల్యాండ్ బ్యాంకులోని ఈ భూమిని ఎకరాకు రూ.30 లక్షల చొప్పున కేటాయించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద పన్ను మినహాయింపులు, విద్యుత్ రాయితీలు, మౌలిక సదుపాయాల ప్రోత్సాహాలు అందించనున్నారు. శీతల పానీయాలు, పండ్ల రసాలు, ప్యాకెజ్డ్ వాటర్ తయారీకి ఈ యూనిట్ లో ఉత్పత్తులు జరగనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1200 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనుండగా, పరోక్షంగా పలువురు ఇతర రంగాల్లో ఉపాధి పొందనున్నారు.
ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి 2025 డిసెంబర్ కల్లా ఉత్పత్తిని ప్రారంభించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. పరిశ్రమలు & వాణిజ్య శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి, APIIC చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. పారిశ్రామికంగా వెనుకబడిన రాయలసీమకు ఈ ప్రాజెక్టు ప్రగతికి తోడ్పడుతుందని, స్థానిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదలకూ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.