Site icon HashtagU Telugu

Red Sandalwood : టెక్కలిలో పుష్ప సీన్ రిపీట్

Red Sandalwood

Red Sandalwood

ఎర్రచందనం దీనికి విదేశాల్లో ఉండే క్రేజ్ వేరు. ఏపీలో మాత్రమే దొరికే ఈ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో పుష్ప సినిమాలో క్లారిటీగా చెప్పారు. దీంతో అక్రమార్కులు అదే ఫాలో అవుతున్నట్లు ఉన్నారు. సినిమాలో పాల మాటున ఎర్రచందనాన్ని తరలిస్తే..టెక్కలిలో మాత్రం పశువుల దాణా మాటున రవాణా చేస్తున్నారు. పోలీసులు కళ్లుగప్పి సొమ్ము చేసుకుందామని ఎంతో ప్రయత్నించారు. కానీ ఏం చేస్తారు పోలీసులకు చిక్కి కటాకటాలు పాలయ్యారు.

ఓ ఐషర్ వాహనంలో పశువుల తవుడ మాటు ఎర్రచందనం అక్రమంగా రవాణా జరుగుతోందని టెక్కలి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రహదారిపై వాహనాన్ని ఆపి తనఖీలు నిర్వహించారు. 51 బస్తాల మాటు సగం లోడు ఎర్రచందనం దుంగలు ఉండటంలో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ ఎర్రచందనం విలువ లక్షల్లో ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఎర్రచందనం ఎక్కడి నుంచి వస్తుంది.. ఎవరి ద్వారా రవానా జరుగుతుందని అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు, తిరుపతికి చెందిన ఇద్దరు నిందితులతో పాటు మరో పది మంది సూత్రధారులు అక్రమ రవాణాలో పాలుపంచుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా చిత్తూరు కేంద్రంగా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోంది.

Exit mobile version