AP : గణేష్ నవరాత్రులు కాస్త ‘అశ్లీల నృత్యాలు’ గా మారాయి

మండపం ముందే అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ వినాయక చవితి పవిత్రతను మంటగలిపేలా వ్యవహరించారు. ఈ రికార్డింగ్ డ్యాన్సులు వైసీపీ నాయకులు ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Recording Dances In Ganesh Chaturthi Celebrations

Recording Dances In Ganesh Chaturthi Celebrations

విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడి పండుగే వినాయకచవితి (Ganesh Chaturthi ). వినాయకచవితి చవితి వచ్చిదంటే చాలు ఊరు, వాడ , పల్లె , పట్టణం అనే తేడాలేకుండా గణేష్ స్మరణతో మారుమోగిపోతుంటాయి. భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి.. విజయాలు చేకూరాలని దేవుడిని కోరుకుంటుంటారు. అంతే కాదు గణపయ్య భోజనప్రియుడు..కావడం తో విలక్షణ నైవేద్యాలను సమర్పించి గణనాథుడిని ప్రసన్నం చేసుకుంటుంటారు.

ఒకప్పుడు గణేష్ నవరాత్రులను చాల తక్కువగా జరిపేవారు..కాలనీ కి ఒకటి , లేదా రెండు , పల్లెల్లో అయితే ఇంకా తక్కువగా జరిపేవారు. కానీ ఇప్పుడు ఆలా కాదు ప్రతి గల్లీలో 10 నుండి 15 కనిపిస్తున్నాయి. ఇక పల్లెల్లోనూ అదే మాదిరిగా దర్శనం ఇస్తున్నాయి. అయితే ఇందులో కొంతమంది భక్తితో విగ్రహాలు ఏర్పాటు చేస్తే..మరికొంతమంది మాత్రం ఎంజాయ్ చేసేందుకు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. వినాయక పూజ కాగానే డాన్సులు వేయడం చేస్తున్నారు. ఇక ఏపీలో అయితే రికార్డింగ్ డాన్సులు (Recording Dances) వేస్తూ నానా రభస చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా (Prakasam District )లోని ఓ గ్రామంలో వినాయకుడి ముందే అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వీడియో బయటకు రావడంతో నిర్వహకులపై హిందూ సంఘాలు, ప్రజలు భగ్గుమంటున్నారు.

Read Also : Stress Relieving Foods: తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్నారా..? అయితే ఈ ఫుడ్స్ తో ఒత్తిడికి చెక్​..!

గణేషుడిని భక్తిశ్రద్దలతో కొలవాల్సింది పోయి బూతు పాటలతో రికార్డింగ్ డ్యాన్సులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండపం ముందే అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ వినాయక చవితి పవిత్రతను మంటగలిపేలా వ్యవహరించారు. ఈ రికార్డింగ్ డ్యాన్సులు వైసీపీ నాయకులు ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. కేవలం వినాయక చవితి నవరాత్రులు కాదు ఏ పండగ వచ్చిన ఏపీలో ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ నేతలు, అధికారులు , పోలీసులు దగ్గర ఉండి వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక వైసీపీ నేతల బర్త్ డే లు వస్తున్నాయంటే ఇక చెప్పాల్సిన పనేలేదు..నడిరోడ్డు ఫై ఓ చిన్న పాటి…’—-‘ చూసినట్లే. ఆ రేంజ్ లో వారు రెచ్చిపోతున్నారు. అధికారం చేతిలో ఉందని చెప్పి..వారు ఆడింది ఆట..పాడింది పాట ..వేసింది డాన్స్..చేసింది రొమాన్స్ అన్న మాదిరిగా మారిపోయింది. వీరి చేష్టలకు ఆడవారు బండ బూతులు తిడుతూ..ఆ పక్క రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. రాను రానో ఇంకెన్ని ఘోరాలు చేస్తారో ఏమో..

  Last Updated: 20 Sep 2023, 01:56 PM IST