AP Politics: ఎన్డీయేలో టీడీపీ పై ఆ ఇద్ద‌రి దొంగాట‌

ఎన్డీయేతో క‌లిసి వెళ్ల‌డానికి టీడీపీ ఎందుకు సిద్ధం అవుతుంది? ఆ నిర్ణ‌యం వెనుక ఎవ‌రున్నారు? ఎవ‌రికి కోసం అదంతా జ‌రుగుతుంది? ఇద్ద‌రు పారిశ్రామిక‌వేత్త‌ల కోసం ఎన్డీయేలో టీడీపీ భాగ‌స్వామి అవుతుందా? ఎవ‌రు వాళ్లిద్ద‌రు? టీడీపీని తాక‌ట్టు పెట్ట‌డం ద్వారా ఆ ఇద్ద‌రికి వ‌చ్చే లాభం ఏమిటి? ఇవే ఏ ఇద్ద‌రు టీడీపీ కార్య‌కర్త‌లు క‌లిసిన‌ప్ప‌టికీ చ‌ర్చించుకుంటోన్న అంశం.

  • Written By:
  • Updated On - August 30, 2022 / 05:15 PM IST

ఎన్డీయేతో క‌లిసి వెళ్ల‌డానికి టీడీపీ ఎందుకు సిద్ధం అవుతుంది? ఆ నిర్ణ‌యం వెనుక ఎవ‌రున్నారు? ఎవ‌రి కోసం అదంతా జ‌రుగుతుంది? ఇద్ద‌రు పారిశ్రామిక‌వేత్త‌ల కోసం ఎన్డీయేలో టీడీపీ భాగ‌స్వామి అవుతుందా? ఎవ‌రు వాళ్లిద్ద‌రు? టీడీపీని తాక‌ట్టు పెట్ట‌డం ద్వారా ఆ ఇద్ద‌రికి వ‌చ్చే లాభం ఏమిటి? ఇవే ఏ ఇద్ద‌రు టీడీపీ కార్య‌కర్త‌లు క‌లిసిన‌ప్ప‌టికీ చ‌ర్చించుకుంటోన్న అంశం.

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీ ఒంట‌రిగా 109 స్థానాల‌ను గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని తాజా స‌ర్వేల్లోని సారాంశం. ఇంకొంచెం క‌ష్ట‌ప‌డితే మ‌రిన్ని స్థానాలు పెరుగుతాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. ఇలాంటి త‌రుణంలో ఎన్డీయేతో టీడీపీ భాగ‌స్వామి అనే న్యూస్ బాంబ్ మాదిరిగా పేలింది. దీంతో క్రిస్టియ‌న్, ముస్లిం ఓటు బ్యాంకు మ‌రోసారి వైసీపీ వైపు మ‌ళ్లే అవ‌కాశం ఉంది. గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో క్రిస్టియ‌న్, రాయ‌ల‌సీమ‌లో ముస్లిం ఓటు బ్యాంకు గెలుపోట‌ముల‌ను నిర్దేశిస్తోంద‌ని రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న ఎవ‌ర్ని అడిగినా చెబుతారు. ఆ విషయాన్ని ఏ మాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా కేవ‌లం ఇద్ద‌రు పారిశ్రామిక‌వేత్త‌ల కోసం పార్టీ సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకోవ‌డానికి సిద్ధం అవుతుంద‌ని ఆ పార్టీ క్యాడ‌ర్ లోని అంత‌ర్గ‌త చ‌ర్చ‌.

 

Also Read:  Power Bills Issue : `ప‌వ‌ర్` పాలి`ట్రిక్స్`లో సెంటిమెంట్‌

 

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు న‌లుగురు పారిశ్రామిక వేత్త‌ల‌కు రాజ్య‌స‌భ ప‌దవుల‌ను క‌ట్ట‌బెట్టింది. వాళ్లంద‌రూ క‌లిసి రాజ్య‌స‌భ కేంద్రంగా వెంక‌య్య‌నాయుడు చేతుల మీదుగా టీడీపీని బీజేపీలో క‌లిపేశారు. వాళ్ల‌లో ఇద్ద‌రు బ్యాంకుల‌కు పెద్ద ఎత్తున బ‌కాయిలు ప‌డ్డారు. డిఫాల్డ‌ర్లుగా ఉన్నారు. సీబీఐ, ఈడీ కేసుల‌ను ఎదుర్కొంటున్నారు. విచార‌ణ నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో బీజేపీలోకి వెళ్లిన ఆ ఇద్ద‌రూ రాజ్య‌స‌భ వేదిక‌గా టీడీపీని విజ‌య‌వంతంగా బీజేపీలోకి విలీనం చేశారు. ఇప్పుడు ఆ ఇద్ద‌రు టీడీపీ, బీజేపీ పొత్తు కోసం ఆరాట‌ప‌డుతున్నారు. ఎన్డీయేలో భాగ‌స్వామిగా టీడీపీని చేర్చ‌డం ద్వారా శాశ్వ‌తంగా కేసుల నుంచి ర‌క్ష‌ణ పొంద‌డానికి అవ‌కాశం ఉంది. అందుకే, వాళ్లిద్ద‌రూ క‌లిసి మాస్ట‌ర్ స్కెచ్ వేశార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న ప్ర‌చారం.

ప్ర‌స్తుతం ఎన్డీయే భాగ‌స్వామిగా టీడీపీని చేర్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తోన్న ఆ ఇద్ద‌రు 2009 ఎన్నిక‌ల సంద‌ర్బంగా మ‌హాకూట‌మిను క‌ట్టారు. ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీతో టీడీపీని పొత్తు కోసం ఒప్పించారు. ఫ‌లితంగా తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌స్తుతం టీడీపీ లేకుండా పోయింది. ఇప్పుడే ఎన్డీయేకి ఏ మాత్రం ఉనికి కూడాలేని ఏపీ రాష్ట్రంలో బీజేపీతో పొత్తుకు టీడీపీని ఒప్పించ‌గ‌లిగారని తెలుస్తోంది. ఫ‌లితంగా రాబోయే రోజుల్లో టీడీపీని అడ్డుపెట్టుకుని జ‌న‌సేన‌, బీజేపీ ఏపీలో బ‌లం పుంజుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఒక వేళ ఎన్డీయే ప్ర‌భుత్వం 2024లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ జ‌న‌సేన‌, బీజేపీ ఎప్పుడైనా టీడీపీకి గండికొట్టే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌గా మ‌హారాష్ట్ర‌, బీహార్ ను తీసుకోవ‌చ్చు.

 

Also Read: Lokesh Tour : ఉద్రిక్త‌తల‌ నడుమ లోకేష్ చిత్తూరు టూర్

 

దేశ వ్యాప్తంగా బీజేపీ చేస్తోన్న రాజ‌కీయాన్ని గ‌మ‌నిస్తున్న టీడీపీ అధిష్టానం ఆ ఇద్ద‌రు పారిశ్రామిక‌వేత్త‌ల గార‌డీకి ప‌డిపోయిందని ఆ పార్టీలోని కోర్ టీమ్ కొంత భాగం మ‌థ‌న‌ప‌డుతోంది. ఎన్డీయేలో అధికారికంగా టీడీపీ క‌లిసిన వెంట‌నే క్షేత్ర‌స్థాయి ఏపీ రాజ‌కీయం పూర్తిగా మారిపోతుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. అంతేకాదు, సామాజిక‌, మ‌త , ప్రాంత స‌మీక‌ర‌ణ‌లు పూర్తిగా టీడీపికి వ్య‌తిరేకంగా ఉంటాయ‌న్న వాద‌న ఉంది. వీట‌న్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా చంద్ర‌బాబు ఎన్డీయేలో కలిస్తే ఆ ఇద్ద‌రు పారిశ్రామిక‌వేత్త‌లు 2009 లో ఏర్పాటు చేసిన కూట‌మి ఎలా టీడీపీని దెబ్బ‌తీసిందో, 2024 ఎన్డీయే కూట‌మి ఆ త‌ర‌హాలో న‌ష్ట‌ప‌రుస్తుంద‌ని అంచ‌నా వేసే వాళ్లు లేక‌పోలేదు. ఆ ఇద్ద‌రు పారిశ్రామిక‌వేత్త‌ల స్వ‌లాభం కోసం ఆడుతోన్న గేమ్ లో టీడీపీ ప‌డుతుందా? మేలుకుంటుందా? అనేది చూడాలి.