Janasena Pawan Kalyan : పాపం ప‌వ‌న్‌.! ద‌త్త‌పుత్రుడు..అద్దె పార్టీ!!

ఏపీలో ఇటీవ‌ల బాగా బ‌ర్నింగ్ అంశాలుగా గుడివాడ కాసినో (Gudiwada Casino) , ఉద్యోగుల స‌మ్మె,(Employees Chalo Vijayawada) జిల్లాల పెంపు, విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్ప‌డే జిల్లాకు ఎన్టీఆర్ (NTR District)పేరు పెట్ట‌డం, క‌నీసం మ‌చిలీప‌ట్నంకు అయినా వంగ‌వీటి రంగా పేరుపెట్టాల‌ని డిమాండ్‌, లైంగిక వేధింపులు తాళ‌లేక విజ‌య‌వాడ‌లో బాలిక ఆత్మ‌హ‌త్య త‌దిత‌రాలు ఉన్నాయి.

  • Written By:
  • Updated On - February 10, 2022 / 12:45 PM IST

ఏపీలో ఇటీవ‌ల బాగా బ‌ర్నింగ్ అంశాలుగా గుడివాడ కాసినో (Gudiwada Casino) , ఉద్యోగుల స‌మ్మె,(Employees Chalo Vijayawada) జిల్లాల పెంపు, విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్ప‌డే జిల్లాకు ఎన్టీఆర్ (NTR District)పేరు పెట్ట‌డం, క‌నీసం మ‌చిలీప‌ట్నంకు అయినా వంగ‌వీటి రంగా పేరుపెట్టాల‌ని డిమాండ్‌, లైంగిక వేధింపులు తాళ‌లేక విజ‌య‌వాడ‌లో బాలిక ఆత్మ‌హ‌త్య త‌దిత‌రాలు ఉన్నాయి. ఉద్యోగుల స‌మ్మె స‌క్సెస్ అయిన త‌రువాత చ‌లో విజ‌య‌వాడ గురించి ప‌వ‌న్ స్పందించాడు. పీఆర్సీపై ఆల‌స్యంగా స్పందించాన‌ని ప్ర‌తికా ప్ర‌క‌ట‌న ద్వారా ఆయ‌న చెప్పాడు. స‌మ్మె విర‌మించిన త‌రువాత వైసీపీ అధిప‌త్య ధోర‌ణి అంటూ జ‌గ‌న్ స‌ర్కార్ పై విమ‌ర్శ విసిరాడు. అంత‌కు మిన‌హా మిగిలిన బ‌ర్నింగ్ అంశాల‌పై రియాక్ట్ కాలేక‌లేపోతున్నాడు.వాస్త‌వంగా గుడివాడ కాసినో వ్య‌వ‌హారం ఢిల్లీ వ‌ర‌కు వెళ్లింది. ఆధారాల‌తో వీడియోల‌ను అంద‌చేస్తూ ఈడీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. కాసినో రూపంలో భారీగా మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగిందని ఆరోపించింది. అందుకే,విచార‌ణ జ‌ర‌పాల‌ని ఎంపీ రామ్మోన్ నాయుడు ఈడీని కోరాడు. కానీ, ప‌వ‌న్ మాత్ర‌మే నేరుగా కాసినో పై రియాక్ట్ కాలేదు. ఆ మ‌ధ్య గుడివాడ కేంద్రంగా జ‌రుగుతోన్న పేకాట డెన్‌ల‌ గురించి మ‌చిలీప‌ట్న స‌భ‌లో హ‌డావుడి చేశాడు. గుడివాడ కేంద్రంగా జ‌రిగిన కాసినో పై మాత్రం స్పందించ‌డానికి ఆచితూచి అడుగు వేస్తున్నాడు. ఇక జిల్లాల పెంపుపై ఏపీ వ్యాప్తంగా ఆందోళ‌న కొన‌సాగుతోంది. వైసీపీతో స‌హా ప‌లు పార్టీల స్థానిక నాయ‌కులు స్పందిస్తున్నారు. విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్ప‌డే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతూ డ్రాప్ట్ లో పొందుప‌రిచారు. కాపు నేత‌లు కొంద‌రు విజ‌య‌వాడ తూర్పు ప్రాంతానికి రంగా పేరు పెట్టాల‌ని ఆందోళ‌న‌కు దిగారు. ప్ర‌త్యేకించి టీడీపీ లీడ‌ర్ బోండా ఉమ నిర‌స‌న‌దీక్ష‌కు దిగాడు. జ‌న‌సేన నుంచి ఎలాంటి ప్ర‌తిపాద‌న ఇప్ప‌టి వ‌ర‌కు లేక‌పోవ‌డాన్ని ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం నేత‌లు త‌ప్పుబ‌డుతున్నారు.

తెలుగుదేశం పార్టీ లీడ‌ర్ వినోద్ కుమార్ జైన్ (TDP Vinod Kumar Jain) లైంగిక వేధింపులు త‌ట్టుకోలేక 14ఏళ్ల బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకుంది. పోలీసుల విచార‌ణ‌లో దిగ్భ్రాంతిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. గ‌తంలోనూ అనేక మంది బాలిక‌ల‌పై జైన్ ఇలాగే వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఆ ఘ‌ట‌న‌పై టీడీపీ మ‌హిళా విభాగం నిర‌స‌న‌దీక్ష చేసింది. కానీ, జ‌న‌సేనాని ప‌వ‌న్ (Janasena Pawan Kalyan) మాత్రం మౌనంగా ఉన్నాడు. వీర‌మ‌హిళ‌లు సైతం ఆ సంఘ‌ట‌న‌పై పెద్ద‌గా రియాక్ట్ అయిన దాఖ‌లాలు లేవు. ఇక ఉద్యోగులు స‌మ్మె విర‌మించిన త‌రువాత ప్ర‌భుత్వ ఆధిప‌త్య‌ధోర‌ణి అంటూ ప‌వ‌న్ వ్యాఖ్యానించాడు. ప్ర‌భుత్వానికి, ఉద్యోగుల‌కు మ‌ధ్య కుదిరిన సంధిపై ప‌లు అనుమానాల‌కు వ్య‌క్త‌ప‌రిచాడు. ఆధిప‌త్య‌ధోర‌ణితో ఉద్యోగుల‌పై వైసీపీ ఒత్తిడి చేసింద‌ని ఆయ‌న కామెంట్ చేశాడు. ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశాడు.ప‌వ‌న్ ఉప‌యోగించిన ఆధిప‌త్య‌ధోర‌ణి అనే ప‌దంపై ప్ర‌భుత్వం స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణ రియాక్ట్ అయ్యాడు. ప్ర‌భుత్వం, ఉద్యోగుల మ‌ధ్య సంధి కుద‌ర‌డం చంద్ర‌బాబుకు ఆయ‌న ద‌త్త‌పుత్రుడికి న‌చ్చ‌డంలేద‌ని విమ‌ర్శించాడు. ముందు ఎర్ర‌జెండాలు వెనుక ప‌చ్చ‌జెండాలు అంటూ జ‌గ‌న్ (CM Jagan) విప‌క్షాల‌పై విరుచుప‌డ్డాడు. ప‌రోక్షంగా జ‌న‌సేన‌, కమ్యూనిస్ట్ పార్టీల‌ను చంద్ర‌బాబు తెర‌చాటుగా న‌డిపిస్తున్నాడ‌ని ఆరోపించాడు. విప‌క్షాల‌న్నింటినీ చంద్ర‌బాబు ఖాతాలో వేయ‌డానికి వైసీపీ సిద్ధం అయింది. చంద్ర‌బాబు ద‌త్త‌పుత్రుడు ప‌వ‌న్ అంటూ ప‌లుమార్లు వైసీపీ ఆరోపించింది. అందుకు సంబంధించిన కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను కూడా కోడ్ చేస్తోంది. తాజాగా ఉపాధ్యాయ, ఉద్యోగుల స‌మ్మె కూడా బాబు, ప‌వ‌న్ , కామ్రేడ్లు ఆడిన గేమ్ గా భావిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీని నాన్ సీరియ‌స్ గా ప్ర‌జ‌ల‌కు చూపించే ప్ర‌య‌త్నం చేస్తోంది.

మూడు నెల‌ల క్రితం జనసేన గోదావ‌రి జిల్లాల్లో శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మాన్ని చేసింది. ఆ సంద‌ర్భంగా ప‌వ‌న్ రోడ్ల‌పై ఆందోళ‌న‌కు దిగాడు. గోతుల‌ను పూడ్చ‌డానికి ప్ర‌య‌త్నం చేశాడు. ఆనాడు చేసిన శ్ర‌మ‌దానం గురించి అదో పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ పోరాటం అంటూ వైసీపీ(YSRCP) లైట్ గా తీసుకుంది. ప‌వ‌న్ చేసే కార్యక్రమాలన్నీ షో కోసమే అంటూ స‌జ్జ‌ల ఆనాడు దుయ్యబట్టారు. కెమెరా ఆన్ చేసి యాక్షన్ అనగానే నటించి వెళ్లడానికి ఇదేమీ సినిమా కాదని చుర‌కలు అంటించాడు. గోతులు పూడ్చి ఫోటోలు దిగి చేసే ఆందోళన‌లు చేయ‌డానికి ద‌త్త‌పుత్రుడ్ని వ్యూహాత్మంగా బాబు పంపాడ‌ని ఆరోపించాడు.జనసేన పార్టీ ఒక దిశ, ఒక స్ట్రాటజీ లేకుండా ప్రయాణం చేస్తోందని వైసీపీ భావిస్తోంది. పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో ఉండే వ్యక్తి అని, నాలుగు నెలలకు ఒకసారి వచ్చి కార్యక్రమాలు చేస్తే ఏం ఉపయోగంలేదనే విమ‌ర్శ‌లు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా ప్ర‌భుత్వం తీసుకెళ్లింది. సినిమాలు లేని స‌మ‌యం చూసుకుని చంద్ర‌బాబు పంపిన‌ప్పుడు ఏపీకి వ‌స్తుంటాడ‌ని స‌జ్జ‌ల (Sajjala Ramakrishna Reddy) త‌ర‌చూ చేస్తోన్న కామెంట్లు. వాటి ద్వారా నాన్ సీరియ‌స్ పొలిటిష‌య‌న్ గా ప‌వ‌న్ ను చిత్రీక‌రిస్తున్నారు.  తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, బీజేపీతో క‌లిసి వెళ్లి అధికారాన్ని పొందింది. ఆ త‌రువాత 2018 నాటికి జ‌న‌సేన‌, బీజేపీతో టీడీపీ పొత్తు బెడిసింది. ఆ సంద‌ర్భంగా ప‌వ‌న్ పైన వ్య‌క్తిగ‌త హ‌న‌నం చేస్తూ టీడీపీ లీడ‌ర్లు ఆనాడు కామెంట్లు చేశారు. సీజన‌ల్ రాజ‌కీయాలు అభివృద్ధికి ఆటంక‌మ‌ని ప‌వ‌న్ పై 2019 ఎన్నిక‌ల్లో ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న చేసుకున్న పెళ్లిళ్ల అంశాన్ని కూడా వద‌ల‌లేదు. వైసీపీ, జ‌న‌సేన రెండూ ఒక‌ట‌నేని, వైసీపీకి అద్దెకు ఆ పార్టీని ఇచ్చారంటూ ఆనాడు ఆరోపించింది. అధికారం కోల్పోయిన త‌రువాత ప‌వ‌న్ పై టీడీపీ మ‌నసు మార్చుకుంది. ఆ పార్టీతో క‌లిసి కొన్ని చోట్ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు వెళ్లింది. దీంతో చంద్ర‌బాబు ద‌త్త‌పుత్రుడంటూ జ‌న‌సేనానిపై ఫ్యాన్ పార్టీ ధ్వ‌జ‌మెత్తుతోంది. అటు వైసీపీ ఇటు టీడీపీ గ‌త ఏడేళ్లుగా జ‌న‌సేన పార్టీని పురిటిలోనే చంపేయాల‌ని ఎవరికివారే వ్యూహాత్మక రాజ‌కీయ అస్త్రాల‌ను సంధిస్తున్నారు. అవి, రాబోయే 2024 ఎన్నిక‌ల్లో ఎటువైపు మ‌ళ్లుతాయో..చూడాలి.