Vangaveeti Radha : రాధా ‘రెక్కీ’ పైవాడికే ఎరుక‌!

వంగ‌వీటి రాధా చెప్పిన `రెక్కీ` సంఘ‌ట‌న ఏపీ పోలీస్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు మ‌ధ్య అంత‌రాన్ని పెంచుతోంది. ఆధారాలు లేకుండా ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌పై ఆరోప‌ణ‌లు చేయొద్ద‌ని బాబుకు విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతి ఠాణా హిత‌వు ప‌లికాడు. ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ కు `రెక్కీ` ఘ‌ట‌న‌పై బాబు లేఖ రాశాడు.

  • Written By:
  • Updated On - January 3, 2022 / 04:05 PM IST

వంగ‌వీటి రాధా చెప్పిన `రెక్కీ` సంఘ‌ట‌న ఏపీ పోలీస్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు మ‌ధ్య అంత‌రాన్ని పెంచుతోంది. ఆధారాలు లేకుండా ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌పై ఆరోప‌ణ‌లు చేయొద్ద‌ని బాబుకు విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతి ఠాణా హిత‌వు ప‌లికాడు. ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ కు `రెక్కీ` ఘ‌ట‌న‌పై బాబు లేఖ రాశాడు. వేగంగా ద‌ర్యాప్తు చేయాల‌ని కోరాడు. ఆ మేర‌కు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేసిన పోలీసులు ఆధారాలు లేవ‌ని తేల్చేశారు. ఈ ఘ‌ట‌న‌కు తెర‌దింపేశారు. కానీ, రాజ‌కీయ‌ప‌ర‌మైన యుద్ధం మాత్రం ఆగ‌లేదు.టీడీపీ లీడ‌ర్ రాధా ఇంటికి చంద్ర‌బాబు వెళ్లాడు. `రెక్కీ` అంశానికి సంబంధించిన వివ‌రాల‌ను తెలుసుకున్నాడు. ఏపీ పోలీసులు జ‌గ‌న్ తొత్తులుగా వ్య‌వ‌హ‌రించ‌కుండా విచార‌ణ చేయాల‌ని కోరాడు. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని కూడా రాధా ఇంటికి వెళ్లాడు. వంగవీటి రాధా చెప్పిన `రెక్కీ`పై సీబీఐ విచార‌ణ వేయాల‌ని డిమాండ్ చేశాడు. డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ స్వ‌త‌హాగా మంచి ఆఫీసర్ అంటూనే ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ ను కాకుండా జ‌గ‌న్ చ‌ట్టాన్ని అమ‌లు చేస్తున్నాడ‌ని బాబు ఆరోపించాడు. వైసీపీ గూండాలు `రెక్కీ` వెనుక ఉన్నార‌ని ఆరోపించాడు.

Also Read : ఢిల్లీ చ‌ట్రంలో జ‌గ‌న్‌.!

తొలి నుంచి పోలీసుల తీరుపైన చంద్ర‌బాబు అస‌హ‌నంగా ఉన్నాడు. టీడీపీ ఆఫీస్ ల‌పై దాడులు జరిగిన సంద‌ర్భంగా పోలీస్ వ్య‌వ‌హ‌రించిన తీరుపైన ఆనాడు ఫైర్ అయ్యాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏపీ పోలీస్ మీద ఫిర్యాదు చేశాడు. రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద‌కు కూడా దాడుల గురించి తీసుకెళ్లాడు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తరువాత జ‌రిగిన అనే దారుణాల‌ను సంగ్ర‌హించాడు. పోలీసుల వైఫ‌ల్యం కార‌ణంగా ఏపీలో లా అండ్ ఆర్డ‌ర్ దెబ్బ‌తింద‌ని అనేక వేదిక‌ల‌పై ఫిర్యాదు చేశాడు.ప‌లు సంఘ‌ట‌నల‌పై ఏపీ హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. రూల్ ఆఫ్ లా ఏపీలో అమ‌లు కావ‌డంలేద‌ని నిల‌దీసింది. సాక్షాత్తు డీజీపీని హైకోర్టు నిల‌దీసింది. ప‌లు సంద‌ర్భాల్లో వ్య‌క్తిగ‌తంగా స‌వాంగ్ డీజీపీ హోదాలో హైకోర్టుకు హాజ‌ర‌య్యాడు. కొన్ని సంద‌ర్భాల్లో క్ష‌మాప‌ణ‌లు కూడా కోరాడు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా `రెక్కీ` వ్య‌వ‌హారంపై పోలీస్ విచార‌ణ స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని బాబు భావిస్తున్నాడు.

Also Read : కాపుల సమావేశం కాదు.. కాఫీ సమావేశమే.. !

Also Read : బాబు ‘ముందస్తు’ మాట

ప్రస్తుతం వంగ‌వీటి రాధా టీడీపీలో ఉన్నాడు. ఆయ‌న గ‌తంలో వైఎస్ఆర్ ఫ్యామిలీకి సన్నిహితుడు. జ‌గ‌న్ వైఖ‌రి న‌చ్చ‌క‌పోవ‌డంతో టీడీపీలో చేరాడు. అయిన‌ప్ప‌టికీ మంత్రి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీలతో స్నేహంగా ఉంటాడు. పార్టీల‌కు అతీతంగా వాళ్ల మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. వంగ‌వీటి రంగా వ‌ర్థంతి సంద‌ర్భంగా ఇటీవ‌ల ముగ్గురూ ఒకే వేదిక‌ను పంచుకున్నారు. ఆ సంద‌ర్భంగా రాధా చేసిన `రెక్కీ` వ్య‌వ‌హారం రాజ‌కీయాన్ని సంత‌రించుకుంది. ఈ విష‌యంలో టీడీపీ, వైసీపీ ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నాయి. రెక్కీ వెనుక వైసీపీ గుండాలున్నార‌ని టీడీపీ అనుమానిస్తోంది. గ‌తంలో రంగాను చంపిన‌ట్టే ఇప్పుడు రాధాను హ‌త్య చేయించాల‌ని టీడీపీ కుట్ర ప‌న్నింద‌ని వైసీపీ ఆరోపిస్తోంది. ఇలా కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం రాధా `రెక్కీ ` ఘ‌ట‌న‌ను ఎవ‌రికి వాళ్లే అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. విజ‌య‌వాడ పోలీసులు మాత్రం అస‌లు `రెక్కీ` ఆన‌వాళ్లే లేవ‌ని తేల్చేశారు. మ‌రి నిజానిజాలు ఏంటో..ఆ పైవాడికే ఎరుక‌.