Re Post-Mortem : రెండేళ్ల క్రితం చ‌నిపోయిన మ‌హిళ మృత‌దేహానికి రీపోస్టుమార్టం

కృష్ణాజిల్లా గన్నవరంలో రెండేళ్ల క్రితం చనిపోయిన సఫీయాబేగం మృతదేహానికి రీ పోస్టుమార్టం కొనసాగుతుంది. అనుమానాస్పద

  • Written By:
  • Updated On - December 20, 2022 / 01:37 PM IST

కృష్ణాజిల్లా గన్నవరంలో రెండేళ్ల క్రితం చనిపోయిన సఫీయాబేగం మృతదేహానికి రీ పోస్టుమార్టం కొనసాగుతుంది. అనుమానాస్పద కేసులో కోర్టు తీర్పులో పోస్టుమార్టంకు ఆదేశించ‌డంతో గుంటూరు పోలీసులు, గన్నవరం రెవిన్యూ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం జ‌రుగుతుంది. గన్నవరంకు చెందిన సఫీయాబేగం 2020 సెప్టెంబర్ 6న మృతి చెందిందని గుంటూరు పట్టాభిపురం సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సఫీయాబేగం భర్త సలిముల్లా షరీఫ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావడంతో ఇద్దరూ కలిసి కొంత కాలం బెంగుళూరులో ఉద్యోగం చేశారని.. అక్కడ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సఫీయాబేగం గుంటూరు సమీపంలోని దేవాపురంలో అద్దెకు ఉంటూ ఉద్యోగం చేస్తుందన్నారు.

భర్త సలిముల్లా షరీఫ్ కూడా మంగళగిరిలో ఉద్యోగంలో చేరాడని.. వీరిద్ద‌రిని కూర్చోపెట్టి పెద్ద‌ల సమక్షంలో ఇద్దరికీ రాజీ చేయడం జరిగిందన్నారు. ఇద్దరు కలిసి ఉంటున్న నేపథ్యంలో అకస్మాత్తుగా సఫీయాబేగం అనారోగ్యానికి గురైంద‌ని.. అనారోగ్యానికి గురైన సఫీయాబేగంను గుంటూరులోని ఓ హాస్పిటల్ లో అత్త‌మామ‌లు, భ‌ర్త క‌లిసి చేర్పించార‌ని సీఐ తెలిపారు.అయితే హాస్పిటల్ లో చికిత్స పొందుతూ స‌ఫియా భేగం మృతి చెందింది. అనారోగ్యానికి కారణం భర్త స్లో పాయిజన్ ఇచ్చినట్లు ఆరోపణలు వ‌చ్చాయి. 2020 సెప్టెంబర్ 19న సఫీయాబేగం మృతిపై అనుమానం ఉన్నట్లు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో బంధువులు ఫిర్యాద చేశారు పోలీసులు తెలిపారు. బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దార్ధ మెడికల్ కాలేజి డాక్టర్లు ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నామ‌ని సీఐ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తెలిపారు.