Rayudu political entry : అంబ‌టి రాయుడు YCP గుంటూరు గ్రౌండ్లోకి..?

క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు(Rayudu political entry) గుంటూరు ఎంపీగా బ‌రిలోకి దింప‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan operation) స్కెచ్ వేశారు.

  • Written By:
  • Updated On - May 11, 2023 / 04:02 PM IST

క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు మీద వైసీపీ ఆప‌రేష‌న్ దాదాపుగా విజ‌య‌వంతం(Rayudu political entry) అయింది. ఆయ‌న్ను గుంటూరు ఎంపీగా బ‌రిలోకి దింప‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan operation) స్కెచ్ వేశారు. ఐ ప్యాక్ ఇచ్చిన స‌ర్వే ప్ర‌కారం ఈ ఎంపిక జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. గ‌త కొన్ని నెల‌లుగా రాయుడు రాజ‌కీయ ప్ర‌వేశంపై ప‌లు ర‌కాలుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళ‌తార‌ని కొంత కాలం ప్ర‌చారం జ‌రిగింది. సీన్ క‌ట్ చేస్తే, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోట‌లోకి గురువారం ఎంట్రీ ఇచ్చారు. ఇటీవ‌ల ప‌లు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు సానుకూలంగా రాయుడు ట్వీట్లు కూడా చేస్తూ ఉన్నారు. దీంతో ఇక వైసీపీలోకి రాయుడు చేర‌డానికి సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది.

గుంటూరు ఎంపీగా బ‌రిలోకి అంబ‌టి రాయుడు (Rayudu political entry)

ఇటీవ‌ల రాజ‌కీయ జీవితం గురించి రాయుడు(Rayudu political entry) ప్ర‌స్తావించారు. `ఆంధ్ర ప్రదేశ్ నుండి నా రాజకీయ జీవితం” ఉంటుంద‌ని సంకేతాలు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఆయ‌న ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు? ఏ పార్టీలో చేర‌తారు? అనే అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చ జ‌రిగింది. సామాజిక‌వ‌ర్గం ప‌రంగా ఆయ‌న కాపు. అందుకే, జ‌న‌సేన పార్టీలో చేర‌తార‌ని చాలా మంది భావించారు. కానీ, వైసీపీకి ఆయ‌న ద‌గ్గ‌ర‌య్యారు. స‌ర్వేల ప్ర‌కారం గుంటూరు జిల్లా ఆయ‌న‌కు అనుకూలంగా ఉందని తెలుస్తోంది. ఒక వేళ అసెంబ్లీకి పోటీ చేస్తే గుంటూరు జిల్లా ఏ నియోజక‌వ‌ర్గం అనువైన‌ది అనే కోణం నుంచి కూడా స‌ర్వేలు ఐ ప్యాక్ చేసింద‌ట‌. ఆ జాబితాలో స‌త్తెన‌ప‌ల్లి, పెద‌కూర‌పాడు, గుంటూరు 1,2 ఉన్నాయ‌ని తెలుస్తోంది.

రాయుడు  తాడేపల్లి కోట‌లోకి ఎంట్రీ

ఇటీవ‌ల బీఆర్ఎస్ ఏపీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆయ‌న్ను సంప్ర‌దించిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు, కేసీఆర్ కూడా రాయుడుపై(Rayudu political entry) ఆప‌రేష‌న్ చేశార‌ట‌. ఆయ‌న కోసం అన్ని పార్టీలు సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. రాజ‌కీయ‌ప‌ర‌మైన ప్ర‌వేశంపై సంకేతాలు ఇవ్వ‌గానే బీఆర్ఎస్, జ‌న‌సేన‌, టీడీపీ ఆయ‌న మీద వ‌ల‌విసిరాయి. చివ‌ర‌కు వైసీపీ గూటికి ఆయ‌న చేరుంటార‌ని గురువారం జ‌గ‌న్మోహన్ రెడ్డితో భేటీ త‌రువాత అర్థ‌మ‌వుతోంది.

భారత మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు (Rayudu political entry) రాజకీయ ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు తన IPL అసైన్‌మెంట్‌ల తర్వాత పూర్తి రాజ‌కీయా క్రీడ‌లోకి దిగ‌నున్నారు. “ప్రజలకు సేవ చేయడం ఉత్తమ మార్గం కాబట్టి నేను రాజకీయాల్లో చేరాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నాను. పార్టీని ఎన్నుకునే ముందు నేను ప్రజలను కలవాలనుకున్నాను. ` అంటూ ఇటీవ‌ల రాయుడు వ్యాఖ్యానించారు. ఆనాటి నుంచి ఆయ‌న రాజ‌కీయ ప్ర‌వేశంపై త‌ర‌చూ ప‌లు క‌థ‌నాలు మీడియా, సోషల్ మీడియా వేదిక‌గా రావ‌డం చూస్తున్నాం.

జగన్ స్పీచ్ ను అంబటి రాయుడు రీట్వీట్

గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు(Rayudu political entry) ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. అత‌ను రంజీ ట్రోఫీని ప్రారంభించిన హైదరాబాద్ నుండి పోటీ చేయడానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? అనే కోణం నుంచి కూడా న్యూస్ చ‌క్క‌ర్లు కొట్టింది. దానిపై ఆయ‌న ఇటీవ‌ల క్లారిటీ ఇస్తూ ఏపీ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశం ఉంటుంద‌ని సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుత ఐపీఎల్‌తో తన క్రికెట్ కెరీర్‌ను ముగించే అవకాశం ఉంది. రాజ‌కీయ ఇన్నింగ్స్ ప్రారంభించ‌నున్నారు. ఇటీవల సీఎం జగన్ ప్రసంగాన్ని రీట్వీట్ చేసిన రాయుడు ఇప్పుడు తాడేపల్లి కోట‌లోకి ఎంట్రీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు జ‌గ‌న్ శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ స్పీచ్ ను అంబటి రాయుడు రీట్వీట్ చేశారు. అంతేకాదు, ఏపీలో ప్రతి ఒక్కరికీ మీపై విశ్వాసం ఉంది సర్ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆనాడే ఆయ‌న వైసీపీలోకి వెళ్ల‌డానికి సిద్ద‌మ‌య్యార‌ని ప్ర‌చారం మొద‌ల‌యింది.

Also Read : YCP-TDP : జ‌గ‌న్ న‌జ‌ర్,చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌పై జీవో నెంబ‌ర్ 1

క్రికెట‌ర్ రాయుడు(Rayudu political entry) 2018లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయ‌న 1,694 పరుగులు చేశాడు. సగటున 55 వన్డే ఇంటర్నేషనల్ (ODIలు)లో మూడు సెంచరీలు మరియు 10 అర్ధ సెంచరీలు కొట్టారు. ఆయ‌న స‌గ‌టు రేటింగ్ 47.05 గా ఉంది. ఆరు టీ20లు ఆడి 42 పరుగులు చేశాడు. టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2013లో జింబాబ్వేపై వన్డేల్లో అరంగేట్రం చేసిన రాయుడు , 2018లో రాంచీలో ఆస్ట్రేలియాతో తన చివరి ODI ఆడాడు. అతను హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించారు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ విభాగాల్లో గుర్తింపు పొందాడు. టీమిండియాకు కూడా ప్రాతినిధ్యం వహించినా, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ద్వారానే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు.

Also Read : Balineni : జ‌గ‌న్ పై `బాలినేని`ప‌వ‌రిజం, YCPకి బై?