Site icon HashtagU Telugu

Ramesh Kumar Reddy : వైసీపీలో చేరిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే..

Tdp Leaders Joins Ycp

Tdp Leaders Joins Ycp

మొన్నటివరకు ఓ లెక్క..ఇప్పుడు ఓ లెక్క అన్నట్లు ఉంది వైసీపీ పరిస్థితి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు వైసీపీ (YCP) నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వచ్చి టీడీపీ లో చేరగా..ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నుండి నేతలు బయటకు వస్తూ వైసీపీ లో చేరుతున్నారు. ముఖ్యంగా జనసేన , టీడీపీ టికెట్స్ ఆశించి భంగపడ్డ నేతలు వరుసపెట్టి వైసీపీ కండువాలు కప్పుకుంటూ వైసీపీ గ్రాఫ్ పెంచుతున్నారు.

టీడీపీ రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఆర్‌ రమేష్‌ కుమార్‌ రెడ్డి (Rayachoti TDP Reddeppagari Ramesh Kumar Reddy) , లక్కిరెడ్డిపల్లె మాజీ జెడ్పీటీసీ మోహనరెడ్డి, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎంపీపీ ఉమాపతిరెడ్డి, మార్కెటింగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కె ప్రభాకరరెడ్డి, హాస్పిటల్‌ కమిటీ మాజీ చైర్మన్‌ షేక్‌ హుస్సేన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఓలుదాసు కృష్ణమూర్తి, దివ్యకుమార్‌రెడ్డి, పలువురు ఇతర నేతలు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆర్.రమేష్ కుమార్ రెడ్డి తనకు టిడిపి టికెట్ రాకపోవడంతో తీవ్ర అసమ్మతికి గురయ్యారు. ఐదేళ్లుగా ఇన్చార్జిగా పార్టీ కోసం చేసిన కష్టం కనిపించలేదా అంటూ ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను కాకుండా మరో నేత రామ ప్రసాద్ రెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత అయినా అధిష్టాన ముఖ్య నేతలు ఆయనను సంప్రదించి సర్దుబాటు చేసే ప్రయత్నాలు ఆ స్థాయిలో జరగలేదు. దీంతో వారిలో మరింత ఆవేదనకు గురయ్యారు. ఈ పరిణామాలు నేపథ్యంలో రమేష్ కుమార్ రెడ్డి టీడీపీకి మంగళవారం రాజీనామా చేసి..ఈరోజు వైసీపీ లో చేరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటు జనసేన కీలక నేత పోతిని మహేష్ (Pothani Mahesh) తో పాటు ఆయన వర్గీయులు జనసేన నుంచి విజయవాడ పట్టణ ఉపాధ్యక్షుడు వెన్న శివశంకర్, పశ్చిమ నియోజకవర్గం డివిజన్‌ అధ్యక్షులు షేక్‌ అమీర్‌ బాషా, పి శ్రీనివాసరావు, ఎస్‌ రాముగుప్తా, పిల్లా వంశీకృష్ణ, సోమి గోవిందరావు, ఎం.హనుమాన్, సయ్యద్‌ మొబీనా, జెల్లి రమేష్, పలువురు ఇతర నేతలు సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ లో చేరారు.

మరోపక్క రాజంపేట అసెంబ్లీ నుండి అక్కడ ఇంచార్జిగా పని చేస్తూ వచ్చిన చెంగల్రాయుడిని కాకుండా రాయచోటికి చెందిన మాజీ ఎంపీ పాలకొండ రాయుడు తనయుడు సుగవాసి సుబ్రహ్మణ్యంను టీడీపీ బరిలో దింపింది. దీంతో చంగల్ రాయుడు ఆయన అనుచర వర్గం తీవ్ర అసమ్మతికి గురవుతోంది. ఆయన తన వర్గాన్ని కూడగట్టుకొనే పనిలో ఉన్నారు. సొంత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు చూస్తుంటే పార్టీపై తిరుగుబాటు తప్పదా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఎఫెక్ట్ ఎన్నికల ఓట్ల ఫై ఎంత పడుతుందనేది చూడాలి.

Read Also : Team India: ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ కప్‌కు భార‌త్ జ‌ట్టు ఇదేనా..?