Ravi Kota : అసోం సీఎస్‌గా తెలుగు ఐఏఎస్‌ అధికారి.. నేపథ్యమిదీ

Ravi Kota : మన తెలుగు వ్యక్తికి మరో కీలక అవకాశం లభించింది. 

Published By: HashtagU Telugu Desk
Ravi Kota

Ravi Kota

Ravi Kota : మన తెలుగు వ్యక్తికి మరో కీలక అవకాశం లభించింది.  అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా రవి కోట బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న పబన్‌కుమార్‌ బోర్తకుర్‌ పదవీ విరమణ చేయడంతో రవి ఆ బాధ్యతలు చేపట్టారు. రవి అసోం సీఎస్‌ బాధ్యతలతో పాటు పరిశ్రమలు, వాణిజ్యం, ప్రభుత్వరంగ సంస్థలు, ఆర్థికశాఖ అదనపు ప్రత్యేక కార్యదర్శి బాధ్యతలనూ  నిర్వర్తించనున్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు వాస్తవ్యులు. ముఖ్యమైన  పదవిని పొందిన రవి కోట(Ravi Kota) కెరీర్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • రవి కోట 1966 ఏప్రిల్‌ 12న జన్మించారు.
  • ఈయన భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో ఆగ్రానమీలో పీహెచ్‌డీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు.
  • రవి కోట 1993వ బ్యాచ్‌ అసోం – మేఘాలయ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి.
  • అసోం సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి డాక్టరేట్‌ ఈయనే.
  • అసోంలో ఉల్ఫా తీవ్రవాదులతో రాష్ట్ర ప్రభుత్వానికి  జరిగిన శాంతి ఒప్పందంలో రవి కోట కీలక పాత్ర పోషించారు.

Also Read : Burning Tongue Remedies: మీ నాలుక కాలిందా..? అయితే వెంట‌నే ఇలా చేయండి..!

  • ఢిల్లీలోని అసోం  భవన్‌లో రెసిడెంట్  కమిషనర్‌గా కూడా  ఆయన పనిచేశారు.
  • 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో రవి కోట పనిచేశారు.
  • అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం ఆర్థిక విభాగాధిపతిగా పనిచేసి భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు, వాతావరణ భాగస్వామ్యంపై రవి కోట విస్తృతంగా దృష్టి సారించారు. పబ్లిక్‌ ఫైనాన్స్‌, మాక్రో ఎకనామిక్స్‌ విధానాల రూపకల్పనలో రవి కోట కీలక భూమిక పోషించారు.
  • 15వ ఆర్థిక సంఘానికి సంయుక్త కార్యదర్శిగా పనిచేసినప్పుడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి కమిషన్‌కు రవి కోట లోతైన సమాచారం అందించారు.

Also Read : Phone Tapping Case : ప్రతిపక్షాన్ని ఓడించేందుకే ‘ఫోన్ ట్యాపింగ్‌’ను వాడారు.. మాజీ పోలీసు అధికారి ‘ఒప్పుకోలు’

  Last Updated: 02 Apr 2024, 09:34 AM IST