Ravela Kishore Babu : జగన్ సమక్షంలో వైసీపీ లో చేరిన రావెల కిషోర్ బాబు

టీడీపీ మాజీ మంత్రి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు (Ravela Kishore Babu) బుధువారం వైసీపీ (YCP) తీర్థం పుచ్చుకున్నారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో రావెల కిషోర్ బాబు, ఆయ‌న స‌తీమ‌ణి శాంతి జ్యోతి లు సీఎం జగన్ (CM Jagan) సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు వైయ‌స్‌ఆర్‌సీపీ సమన్వయకర్త బాలసాని కిరణ్‌ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా రావెల […]

Published By: HashtagU Telugu Desk
Kishor Joins Ycp

Kishor Joins Ycp

టీడీపీ మాజీ మంత్రి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు (Ravela Kishore Babu) బుధువారం వైసీపీ (YCP) తీర్థం పుచ్చుకున్నారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో రావెల కిషోర్ బాబు, ఆయ‌న స‌తీమ‌ణి శాంతి జ్యోతి లు సీఎం జగన్ (CM Jagan) సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు వైయ‌స్‌ఆర్‌సీపీ సమన్వయకర్త బాలసాని కిరణ్‌ కుమార్ ఉన్నారు.

ఈ సందర్భంగా రావెల (Ravela Kishore Babu) మాట్లాడుతూ, పార్టీ కోసం జగన్ ఏం చెబితే అది చేస్తానని అన్నారు. ఎప్పటికీ ఒక విధేయుడిగా ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుతున్నది సీఎం జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. పేదల ఖాతాల్లో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు జమ చేసి చరిత్ర సృష్టించడం జగన్ కే సాధ్యమైందని కొనియాడారు. జగన్ నిస్వార్థంగా పేదలకు చేస్తున్న సేవలను చూసే వైసీపీలో చేరానని రావెల పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

2014లో గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు(ఎస్సీ) నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2018లో జనసేనలోకి, అటు నుంచి బీజేపీలోకి మారారు. గతేడాది బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ గూటికి చేరారు. మరి ఎక్కడైనా ఉంటారో..లేక ఎన్నికల తర్వాత వెళ్తారో చూడాలి.

రావెల కిషోర్ బాబు తో పాటు గుంటూరుకు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి చుక్కా విల్స‌న్ బాబు (Chukka Wilson Babu) సైతం వైసీపీ లో చేరారు. ఈ మేర‌కు విల్సన్‌కు సీఎం జ‌గ‌న్ పార్టీ కండువా క‌ప్పి వైసీపీ లోకి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో చుక్కా విల్స‌న్ బాబు కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు.

 

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలలలో వలసల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా వైసీపీ టికెట్ రానివారు పెద్ద ఎత్తున బయటకు వచ్చి టిడిపి , జనసేన లలో చేరుతున్నారు. ఇదే క్రమంలో టిడిపి , జనసేన నేతలు వైసీపీ లో చేరుతున్నారు. మొత్తం మీద ఒక్క బిజెపి తప్ప అన్ని పార్టీలలో వలసలు అనేవి కొనసాగుతున్నాయి.

Read Also : Gaddar Awards: నంది అవార్డులకు బదులు గ‌ద్ద‌ర్ అవార్డులు: CM రేవంత్‌

  Last Updated: 31 Jan 2024, 08:41 PM IST