తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS) కు ఆ తర్వాత కూడా వరుస షాకులు తప్పడం లేదు. ఇప్పటివరకు తెలంగాణ లో షాక్ లు విన్న బిఆర్ఎస్..ఇప్పుడు ఏపీ (AP) నుండి షాకులు వినిపిస్తున్నాయి. ఏపీ బిఆర్ఎస్ కీలక నేత ..వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధం అయ్యినట్లు తెలుస్తుంది. గత ఏడాది బిఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు (Ravela Kishore Babu)..ఇప్పుడు వైసీపీ లో చేరేందుకు సిద్దమైనట్లు సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే నాలుగు పార్టీలు మారిన రావెల కిషోర్ బాబు, ఈనెల 30న గుంటూరులో వైసీపీ కండువా కప్పుకొనున్నట్లు తెలుస్తుంది. ఎంపీ అయోధ్య రామిరెడ్డి, వైసీపీ అగ్ర నేతల ద్వారా వైసీపీలో చేరుతారని సమాచారం. గత కొంతకాలంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై రావెల కిషోర్ బాబు అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ పార్టీలో చేరేందుకు డిసైడ్ అయ్యారు. 2014లో ప్రత్తిపాడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కిషోర్ బాబు.. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు.
ఇదిలా ఉంటె మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేతను తగ్గించుకునేందుకు చివరిగా కొన్ని అస్త్రాలను ప్రయోగించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. రైతులకు రుణ మాఫీ, నిరుద్యోగులకు మెగా డీఎస్సీ, ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ఐఆర్ ప్రకటించే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి కూడా పరిశీలించనున్నారు. ఇవన్నీ ఈ నెల 31న జరిగే కేబినెట్లో చర్చించనున్నట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరోపక్క ఇతర పార్టీల నేతలను సైతం లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also : AP Political Parties Campaign : మరికొద్ది రోజుల్లో ఏపీలో నేతల ప్రచారం..అంతకు మించి