ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ మాఫియా (Ration Mafia) మళ్లీ మొదలైందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (Jagan) ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నదని ఆరోపించారు. తక్కువ నాణ్యత కలిగిన బియ్యం రేషన్ కార్డుతో ఇవ్వబడుతున్నప్పుడు, రేషన్ సిస్టమ్ లో వున్న అవకతవకలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించకుండా, నాసిరకం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. స్వర్ణరకం బియ్యం ప్రజలకు అందేలా చూడాల్సిన ప్రభుత్వం ..అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తోంది. మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మనం రేపు మళ్లీ అధికారంలోకి వస్తాం. చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ప్రతీ నెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేషన్ బియ్యం వ్యవహారంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. అసలు అధికారంలో ఎవరున్నారు అని సందేహం వస్తోంది. రాష్ట్రంలో అధికారం మారి ఏడు నెలలు అయ్యింది. మంత్రులు వాళ్లే, అధికారులు వాళ్ల మనుషులే, చివరకు చెక్‌పోస్టులు వాళ్లు పెట్టినవే ఉన్నాయి. కాకినాడ పోర్టులో కస్టమ్స్ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్లే ఉన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు?.. ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు? అని ప్రశ్నించారు.
Read Also : Trump Sons Fiancee : కాబోయే కోడలికి డొనాల్డ్ ట్రంప్ కీలక పదవి.. కొడుకుతో ఆమె నిశ్చితార్ధంపై సస్పెన్స్ ?