- 2016లోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్లాన్
- 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన పనులను పరుగులు
- ‘విజనరీ లీడర్’ అనడానికి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం (RGIA) ఒక సజీవ సాక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు, అభివృద్ధి కాంక్షకు నిదర్శనంగా విశాఖపట్నంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిలుస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు వంటి చోట్ల రెండో విమానాశ్రయ నిర్మాణానికి దశాబ్దాల కాలం పడుతుంటే, ఏపీలో రికార్డు స్థాయిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం వెనుక ఆయన పట్టుదల కనిపిస్తోంది.
విశాఖపట్నం గ్లోబల్ సిటీగా ఎదగాలంటే ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం అత్యవసరమని గుర్తించిన చంద్రబాబు నాయుడు, 2016లోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్లాన్‌ను రూపొందించారు. కేవలం ప్రతిపాదనలకే పరిమితం కాకుండా, కేంద్రం నుంచి అనుమతులు సాధించడం, భూసేకరణ పూర్తి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మధ్యలో ప్రభుత్వ మార్పు వల్ల పనులు మందగించినప్పటికీ, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన పనులను పరుగులు పెట్టించారు. ఫలితంగా, కేవలం ఏడాదిన్నర కాలంలోనే విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేసుకుని ట్రయల్ రన్‌కు సిద్ధం కావడం ఒక రికార్డుగా నిలిచింది.
Cbn Bhogapuram
చంద్రబాబు నాయుడు ‘విజనరీ లీడర్’ అనడానికి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం (RGIA) ఒక సజీవ సాక్ష్యం. పాతికేళ్ల క్రితమే ఆయన 5 వేల ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను ప్లాన్ చేసినప్పుడు ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ, ఆయన ముందుచూపు వల్ల నేడు హైదరాబాద్ విమాన ప్రయాణికుల రద్దీని తట్టుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అదే తరహాలో ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించడం ద్వారా ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చబోతున్నారు. ఇది పూర్తయితే విశాఖకు పారిశ్రామికంగా, పర్యాటకంగా భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
అబ్దుల్ కలాం అన్నట్లుగా, ఒక గొప్ప కల కనడమే కాకుండా దాన్ని సాకారం చేసే వరకు విశ్రమించని నైజం చంద్రబాబుది. భోగాపురం విజయవంతం కావడంతో ఆయన ఖాతాలో ఇది రెండో గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా చేరింది. భవిష్యత్తులో అమరావతి, తిరుపతి వంటి నగరాల్లో కూడా ఇటువంటి ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా, రాబోయే 20-30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయన చేసే ప్లానింగ్ రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదిగా మారుతోంది.
