సరోగేటివ్ (surrogate) తల్లి ఆవు ద్వారా అరుదైన సాహిహ్రాల్ (Sahihral)ఆవు దూడ జన్మించింది. ఇలా జరగడం ఏపిలో ఇదే మొదటిసారి కావటం గమనార్హం. ఇదంతా ఎస్వీ వెటర్నరీ వర్సిటీ నిపుణుల ఘనత. ఈ అరుదైన ఆవు దూడను టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీనికి పద్మావతి (Padmavati) గా నామకరణం చేశాం మని చెప్పారు. గిర్ ఆవు పిండంను ఒంగోలు ఆవు గర్భంలో ప్రవేశ పెట్టడం జరిగిందని, సాహివాల్ ఎంబ్రీయోను ఒంగోలు జాతి ఆవులో అభివృద్ధి చేశామని తెలిపారు. దేశీయ ఆవు పాల ఉత్పత్తి లక్ష్యంతో ఈ ప్రయోగాన్ని టీటీడీ ప్రోత్సహించి, వర్సిటీకి నిధులు ఇవ్వడం జరిగిందని ధర్మారెడ్డి తెలిపారు.
స్వామి, అమ్మవార్లకు దేశీయ ఆవు పాలతో ప్రసాదాలు తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేశీయ ఆవులు అంతరించి పోతున్న నేపథ్యంలో వీటిని అభివృధి చేస్తున్నామని అన్నారు. 11 ఆవులుకు ఎంబ్రియో ఆవులు సిద్దంగా ఉన్నాయి. ఏడాదికి 94 సరోగేటివ్ ఆవు దూడలు పుట్టించేందుకు సిద్దం చేశామని టీటీడీ ఈవో తెలిపారు. శ్రీవారి ఆలయంలో రోజుకు 60కిలోల నెయ్యి అవసరం ఉంటుంది. 40 లీటర్ల పాలకు ఒక కిలో నెయ్యి వస్తుంది. రోజుకు 2500 లీటర్ల పాలు అవసరం కాగా, ఇందులో రోజుకు 500 దేశీయ ఆవుపాలు అవసరం ఉందని ధర్మారెడ్డి చెప్పారు.
ఐదు మంది దాతలు 500 ఆవులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. వీరిలో రామలయం ట్రస్ట్ వాళ్ళు 100 ఆవులు, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ 70 ఆవులు ఇచ్చారని టీటీడీ ఈవో చెప్పారు. వచ్చే ఐదేళ్లలో టీటీడీ గోశాలలో వెయ్యి ఆవుల్ని సిద్ధంచేసి శ్రీవారి ఆలయం, అమ్మవారీ ఆలయం అవసరం మేరకు వినియోగిస్తామని అన్నారు. గో ఆధారిత పశుగ్రాసం తయారు చేసేందుకు జిల్లా రైతులకు అవకాశం ఇస్తామని అన్నారు. శ్రీ వేంకటేశ్వర వెంటర్నరీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. i v.e టెక్నాలజీ ద్వారా ఒక ఆవు నుంచి పది నుంచి 15 వరకు పిండాలు సేకరించి అద్దె గర్భం ఆవుల్లో ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. సరోగసి ద్వారా అధిక పాల ఉత్పత్తి చేయవచ్చునని చెప్పారు.