Site icon HashtagU Telugu

YSRCP vs TDP : పరిటాల శ్రీరామ్ కు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సవాల్….దమ్ముంటే గన్ మెన్ లేకుండా బయటకు రా..!!

TDP YCP

TDP YCP

అనంతపురం జిల్లా రాజకీయం హీటెక్కింది. రాప్తాడు నియోజకవర్గంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అధికారులు అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే…వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారుల పనిచెబుతామంటూ హెచ్చరించారు.

పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి స్పందించారు. నేరస్తులకు ఆశ్రయమిచ్చే కల్చర్ పరిటాల కుటుంబానిదేనని ఆరోపించారు. పరిటాల శ్రీరామ్ దౌర్జన్యాలు చేస్తుంటూ సహించేది లేదన్నారు. పోలీసులు నిజాయితీగా పనిచేయడం పరిటాలకు నచ్చడం లేదని ఆరోపించారు. దమ్ముంటే గన్ మెన్ లేకుండా బయటకు రావాలని పరిటాల శ్రీరామ్ కు తోపుదుర్తి సవాల్ విసిరారు.