Site icon HashtagU Telugu

Rapaka Varaprasad: జ‌న‌సేన‌లోకి రీఎంట్రీ ఇస్తున్న రాపాక‌.. ముహూర్తం ఫిక్స్‌..?

Janasena

Janasena

Rapaka Varaprasad: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రాపాక వరప్రసాద్ (Rapaka Varaprasad) రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌తో భేటీ అయ్యారు. దీంతో రాపాక తిరిగి జనసేన పార్టీలో చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాపాక జనసేన తరపున పోటీ చేసి గెలుపొందారు. అనంతర పరిణామాల వల్ల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు రూట్ మార్చిన ఆయ‌న జ‌న‌సేన‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేసిన అభ్య‌ర్థుల్లో గెలుపొందిన ఏకైక వ్య‌క్తి రాపాక వ‌ర‌ప్రసాదే. అయితే నియోజ‌క‌వర్గ అభివృద్ధి కోసం ఆయ‌న వైసీపీలో చేరిన‌ట్లు చెప్పారు.

ఇక‌పోతే 2024 ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మి ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. కూట‌మిలో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ ఉన్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 ఎంపీ స్థానాల్లో ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే దేశంలోనే తొలిసారి 100శాతం విజ‌యం న‌మోదు చేసిన పార్టీగా జ‌న‌సేన నిలిచింది. అయితే రాపాక జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేసి వైసీపీలో చేర‌టంతో అప్ప‌ట్లో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా విమ‌ర్శ‌లు చేశారు.

Also Read: ShakthiSAT : 108 దేశాల బాలికలతో చంద్రయాన్‌-4 శాటిలైట్.. ‘శక్తిశాట్‌’‌కు సన్నాహాలు

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు రాపాక రీఎంట్రీని జ‌న‌సేన అధినేత స్వాగ‌తిస్తారా..? లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే జ‌న‌సేన నుంచి గ్రీన్‌సిగ్న‌ల్ వ‌చ్చిన త‌ర్వాత‌నే ఆయ‌న బ‌హిరంగంగా జ‌న‌సేన‌లో చేర‌తాన‌ని చెప్పినట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అక్టోబ‌ర్ చివ‌రి వారంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను క‌లిసి పార్టీలో జాయిన్ కానున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

త్వరలో YCPకి రాజీనామా చేస్తా: రాపాక

రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వైసీపీకి రాజీనామా చేస్తానన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే వైసీపీ పెద్దలకు చెప్పానని వివరించారు. అనివార్య పరిస్థితుల్లో జనసేన నుంచి వైసీపీలోకి వెళ్లానన్నారు. ఏ పార్టీలో చేరేది ఇప్పుడే వెల్లడించలేనని రాపాక స్పష్టం చేశారు.