Site icon HashtagU Telugu

AP Ministers Ranks : ఏపీ మంత్రులకు ర్యాంకులు.. చంద్రబాబు, పవన్, లోకేశ్‌కు ఎంతంటే..?

Ranks of AP ministers.. How much for Chandrababu, Pawan, Lokesh..?

Ranks of AP ministers.. How much for Chandrababu, Pawan, Lokesh..?

AP Ministers Ranks : ఏపీ మంత్రులకు పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. ఫైళ్ల క్రియరెన్స్ ను ప్రధాన ప్రాతిపదికగా తీసుకుని ర్యాంకుల జాబితా రూపొందించారు. ఇందులో సీఎం చంద్రబాబుకు 6వ స్థానం లభించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 10వ స్థానంలో ఉండగా… మంత్రి నారా లోకేశ్ 8వ స్థానంలో ఉన్నారు. రాష్ట్ర న్యాయ శాఖ, మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ తొలి స్థానంలో నిలిచారు.

ఫైళ్ల క్లియరెన్స్‌లో వరుసగా మంత్రుల స్థానాలు..

1. ఫరూఖ్
2. కందుల దుర్గేష్
3. కొండపల్లి శ్రీనివాస్
4. నాదెండ్ల మనోహర్
5. డోలా బాలవీరాంజనేయ స్వామి
6. చంద్రబాబు
7. సత్యకుమార్ యాదవ్
8. నారా లోకేష్
9. బీసీ జనార్థన్ రెడ్డి
10. పవన్ కల్యాణ్‌
11. సవిత
12. కొల్లు రవీంద్ర
13. గొట్టిపాటి రవికుమార్
14. నారాయణ
15. టీజీ భరత్
16. ఆనం రాం నారాయణరెడ్డి
17. అచ్చెన్నాయుడు
18. రాంప్రసాద్ రెడ్డి
19. గుమ్మడి సంధ్యారాణి
20. వంగలపూడి అనిత
21. అనగాని సత్యప్రసాద్
22. నిమ్మల రామానాయుడు
23. కొలుసు పార్థసారధి
24. పయ్యావుల కేశవ్
25. వాసంశెట్టి సుభాష్

కాగా, మంత్రులు తమ పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలంటూ.. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను ఆదేశిస్తూనే ఉంటారు. మీరంతా గేర్‌అప్ కావాలి…శాఖలపరంగా పెర్ఫార్మెన్స్ పెంచాలి అని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం ఒక్కో మంత్రితో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొందరిమంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకారు. ఈ సందర్భంగా కొందరు మంత్రుల ఫైల్స్ క్లియయరెన్స్‌లపై అసహనం వ్యక్తం చేశారు.

మరోవైపు మంత్రులకు సీఎం చంద్రబాబు పలు బాధ్యతలు అప్పగిస్తూనే దిశానిర్దేశం చేశారు. మంత్రులు అంతా వచ్చే 3 నెలల పాటు జనంలోకి వెళ్లాలి అని సూచించారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాధ్యత తీసుకోవాలి అని ఆదేశించారు. వచ్చే విద్యా ఏడాది నుంచి తల్లికి వందనం ప్రారంభం అవుతుందని తెలిపారు. ఏప్రిల్‌లో మత్స్యకార భరోసాపై దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు.

Read Also: BJP : మా అభ్యర్థులకు రూ.15 కోట్లు ఆఫర్‌: ఆప్‌ ఆరోపణలు