Site icon HashtagU Telugu

Donation : తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రామోజీ గ్రూప్ భారీ విరాళం..

Eenadu Viralam

Eenadu Viralam

భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు (Telugu States) సాయం అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నేతలు , ప్రభుత్వ ఉద్యోగులు , బిజినెస్ రంగం వారు ఇలా ప్రతి ఒక్కరు తమకు తోచిన సాయం అందజేస్తూ తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. తాజాగా రామోజీ గ్రూప్(RamojiGroups) సంస్థలు కూడా ముందుకు వచ్చి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణలోని వరద బాధితుల సహాయార్థం రూ.5 కోట్లు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి జమ చేస్తున్నట్టు ఓ ప్రకటన జారీ చేశారు. కష్టకాలంలో బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె రేపు ఏపీలో కేంద్ర బృందం (ఇంటర్ మినిస్టీరియల్ టీం) పర్యటించనుంది. ఉన్నతాధికారి, కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి (డీయం అండ్ పీయం) సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో గల కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నేరుగా వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించడంతో పాటు వరద బాధితులతో నేరుగా మాట్లాడనుంది.

ఈ కేంద్ర బృందంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీడీఎంఏ) సలహాదారు (OPS&Comn) కల్నల్ కెపి.సింగ్, కేంద్ర జల సంఘం డైరెక్టర్(CWC) సిద్ధార్థ్ మిత్రా, కేంద్ర జల సంఘం హైదరాబాదు ఎస్ఇ(కెసీసీ) యం. రమేశ్ కుమార్, ఎన్డీఎస్ఏ సదరన్ జోన్ చెన్నైకి చెందిన డైరెక్టర్ ఆర్. గిరిధర్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వివియన్ ప్రసన్నలతో కూడిన కేంద్ర బృందం పర్యటించనుంది.

Read Also : EV Vehicle Subsidy: ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై రూ. 1 లక్ష వరకు సబ్సిడీ.. ద‌ర‌ఖాస్తు ఇలా..!