Ramgopal Varma : టాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు హై కోర్టులో ఊరట లభించింది. ఏపీ హై కోర్టు రామ్ గోపాల్ వర్మ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తొందర పాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. తనను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు. వచ్చే వారం వరకూ అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, సంబంధం లేని వ్యక్తులు తనపై కేసులు పెట్టారని రామ్ గోపాల్ వర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆర్జీవిపై మూడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.
ఇక, ఏపీలో గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ అండతో విపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై వ్యక్తిగతంగా ట్వీట్లతో విరుచుకుపడిన టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ను ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తుందని అంతా భావించారు. ఆయనపై పలు పోలీసు స్టేషన్లలో ఇదే అంశంపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఓసారి, మొత్తం కేసులు కొట్టేయాలని మరోసారి హైకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. కానీ పోలీసులు మాత్రం ఇప్పటివరకూ ఆయన్ను అరెస్టు చేయలేదు.
కాగా… ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో విచార్ణకు రావాలంటూ హైదారాబాద్ లోని ఇంటికి వెళ్లి ఆర్జీవీకి రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో… షూటింగుల్లో బిజీగా ఉండటం వల్ల విచారణకు ప్రస్తుతానికి హాజరుకాలేనని.. ఆన్ లైన్ లో విచారించవచ్చని వర్మ పోలీసులకు వెల్లడించారు. ఇక తనకు పరామర్శలు వెళ్లివెత్తుతుండటంతో వాటిని భరించలేక ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్లు తెలిపారు. మరోపక్క వరుసగా పలు టీవీ ఛానల్స్, యూట్యూబ్స్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో… ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
Read Also: Mokshagna : మోక్షజ్ఞ రెండో సినిమా డైరెక్టర్ అతనేనా..?