Site icon HashtagU Telugu

AP MLC : ఎమ్మెల్సీ లుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

Ap Mlcs

Ap Mlcs

ఆంధ్రప్రదేశ్ (AP) లో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు (MLA Quota MLC Elections) కూటమి అభ్యర్థులు సి.రామచంద్రయ్య (C Ramachandraiah ) , పి.హరిప్రసాద్ (Hari Prasad) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున రామచంద్రయ్య, జనసేన తరఫున హరిప్రసాద్ నామినేషన్ వేశారు. ఇతర పార్టీల నుంచి ఒక్క నామినేషన్ కూడా రాకపోవడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా వీరిద్దరి ఎన్నిక లాంఛనమైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గత నెలలో షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 25న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా.. జులై 2వ తేదీ వరకు నామినేషన్లు సీక్వరించారు. జులై 3న అభ్యర్థుల ఆ నామినేషన్లను పరిశీలించారు. జులై 5 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇచ్చారు. కానీ కూటమి నేతలు తప్ప మరెవరు నామినేషన్ వేసేందుకు రాకపోవడం తో కూటమి నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సి. రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ ఏపీ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. రామచంద్రయ్య ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారటంతో మండలి ఛైర్మన్ ఆయనపై అనర్హత వేటు వేశారు. ఇక మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేయటంతో ఆయన స్థానం కూడా ఖాళీ అయ్యింది. సో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. రెండు పదవులు ఏకగ్రీవం కావడంతో ఎన్నికల నిర్వహణ తప్పింది.

Read Also : Lip Care Tips: పెదాలు నల్లగా మారి ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే?