Site icon HashtagU Telugu

RGV : జనసేన సీఎం అభ్యర్థి చంద్రబాబే – వర్మ సెటైర్

Rgv

Rgv

నిత్యం మెగా ఫ్యామిలీ (Mega Family) , జనసేన పార్టీ (Janasena) ఫై విమర్శలు , ఆరోపణలు , సెటైర్లు వేస్తూ అభిమానుల్లో ఆగ్రహం నింపే డైరెక్టర్ వర్మ (RGV) మరోసారి జనసేన ఫై సెటైర్లు వేసి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా వర్మ..వైసీపీ (YCP) కి సపోర్ట్ చేస్తూ టీడీపీ , జనసేన లపై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన విమర్శలకు మరింత పదును పెట్టి ఇంకాస్త దూకుడు పెంచారు. నిన్నటికి నిన్న కేంద్రం..చిరంజీవి సమాజానికి చేస్తున్న సేవకు గాను పద్మ విభూషణ్ అవార్డు ప్రకటిస్తే..దానిపై కూడా సెటైర్లు వేసి అందరి చేత ఛీ కొట్టించుకున్నాడు.

తాను ఎప్పుడూ పద్మా సుబ్రహ్మణ్యం గురించి, బిందేశ్వర్ పాఠక్ గురించి వినలేదని , అయితే వారిని మెగాస్టార్ చిరంజీవితో సమానంగా ఉంచడం, వారికి కూడా పద్మవిభూషణ్ ప్రకటించడం తనకు నచ్చలేదన్నారు. అందుకే తాను ఈ అవార్డుతో థ్రిల్ ఫీల్ కావడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకవేళ చిరంజీవి గారికి ఇలా అయినా సంతోషంగా ఉంది అంటే తాను కూడా సంతోషంగా ఉన్నట్టు నటిస్తాను అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. వర్మ చేసిన ఈ ట్వీట్ ఫై అభిమానులే కాదు సినీ ప్రముఖులు కూడా ఛీ కొడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉండగా…తాజాగా జనసేన పార్టీ ఫై సెటైర్లు వేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ‘టీడీపీ సీఎం అభ్యర్థి చంద్రబాబు. వైసీపీ సీఎం అభ్యర్థి జగన్. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి షర్మిల. బీజేపీ సీఎం అభ్యర్థి పురందీశ్వరి. జనసేన సీఎం అభ్యర్థి చంద్రబాబు’ అనే పోస్టును షేర్ చేశారు. దీనిపై జనసేన శ్రేణులతో పాటు , టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక వర్మ సినిమాల విషయానికి వస్తే..జగన్ కథ ఆధారంగా వ్యూహం అనే మూవీ తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. సినిమాలో అభ్యంతర సన్నివేశాలు , డైలాగ్స్ ఉన్నాయని మరోసారి సెన్సార్ చేయాలనీ కోరుతూ తీర్పు ఇచ్చింది.

Read Also : Ration Card E-KYC : రేషన్‌ కార్డుదారుల ఈ-కేవైసీ గడువు పెంపు.. ఎప్పటివరకు ?

Exit mobile version