Site icon HashtagU Telugu

Ram Chariot Caught Fire : అనంతపురంలో రాములవారి రథానికి నిప్పు..

Ram Chariot Caught Fire In

Ram Chariot Caught Fire In

Ram Chariot Caught Fire in Anantapur District : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డు (Tirumala Laddu) వివాదం కొనసాగుతుండగా..తాజాగా అనంతపురం జిల్లా (Anantapur District) కనేకల్ మండలం హనకనహాళ్‌ గ్రామంలో శ్రీరామాలయం రథానికి (Ram Chariot Caught) గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే హిందువులంటే లెక్క చేయడం లేదని , హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని అంత గగ్గులు పెడుతుండగా..ఇప్పుడు వరుసగా జరుగుతున్న దారుణాలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి.

హనకనహాళ్‌ గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శ్రీ రామాలయానికి వచ్చి రథానికి నిప్పు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు యత్నించారు. అప్పటికే సగానికిపైగా రథం కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రథానికి నిప్పు పెట్టిన దుండగులను శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దర్యాప్తుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తనకు తెలపాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. సంఘటనా స్థలం వద్ద బీజేపీ , బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రథానికి ఎవరు నిప్పు పెట్టారో వెంటనే తెలుసుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. తమ సెంటిమెంట్లను దెబ్బతీయడానికి కొందరు కావాలనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని పలువురు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నారు.

ఇది కేవలం స్థానిక గొడవల కారణంగా జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తేరు కాలిన ప్రదేశంలో విలువైన సమాచారం సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. వేలిముద్రలు గుర్తించామన్నారు. వాటి ఆధారంగా నింధితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఆధారాలు సేకరించడానికి డాగ్ స్క్వాడ్, క్లూస్​ టీమ్​లను రప్పిస్తున్నట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఈ కేసును చేధిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Also : On This Day In 2007: 2007 ప్రపంచకప్ అద్భుతానికి 17 ఏళ్లు..